Goddess Lakshmi Favorite Zodiac: లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అరుదైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడు డబ్బే, డబ్బు..

Goddess Lakshmi Favorite Zodiac Signs: లక్ష్మీదేవి కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు నుంచి కూడా విముక్తి కనిపిస్తుందని జ్యోతిష్యం చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 8, 2025, 10:21 AM IST
Goddess Lakshmi Favorite Zodiac: లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అరుదైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడు డబ్బే, డబ్బు..

Goddess Lakshmi Favorite Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సంపద, ఆనందం, డబ్బుకు సూచిక భావిస్తారు. అంతేకాకుండా శుక్రుడి అనుగ్రహం ఉన్న  రాశులకి ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు భావిస్తారు. కానీ కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ అనుగ్రహం చెపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆయా రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా గురువారం కొన్ని రాశుల వారు అమ్మవారిని పూజించడం వల్ల ఆర్థిక పరంగా కూడా పోలేడు ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ అనుగ్రహాన్ని చూపుతుంది.. వీరు ఎప్పుడు ఆర్థికపరమైన లాభాలు పొందడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుతారు.  అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

వృషభ రాశి 
వృషభ రాశి లో జన్మించిన వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఎలాంటి పనులు చేసిన ప్రధాన బాధ్యతలతో ముందుకు వెళుతూ మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం లభించడమే కాకుండా సభ్యులంతా ఎంతో ఆనందంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు కూడా ఎంతో సులభంగా పొందగలుగుతారు.. అంతేకాకుండా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు.

వృశ్చిక రాశి 
కుజుడి అనుగ్రహం వృశ్చిక రాశి వారికి ఎల్లప్పుడూ లభించడమే, కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులతో వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు డబ్బులు సింపుల్గా సంపాదిస్తారు. అంతేకాకుండా అద్భుతమైన అవకాశాలు కూడా పొందగలిగే అదృష్టాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరికి ఎలాంటి సమస్యలైనా వెంటవెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఉన్నత విజయాలను సాధించడమే కాకుండా జీవితంలో డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి ఆరోగ్యం ఎక్కువగా చాలా బాగుంటుంది.

కర్కాటక రాశి 
కాడకి రాశిలో జన్మించిన వారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆస్తులు కూడా భారీ మొత్తంలో పొందగలుగుతారు. ఇక చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయి. జీవితంలో ఊహించని లగ్జరీ లైఫ్ అనుభవించగలుగుతారు. అలాగే పెద్ద పెద్ద ఆస్తులకు కూడా యజమానులు అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జీవితంలో వీరు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలిగే అవకాశాలు ఉన్నాయి.

సింహరాశి 
సింహ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి తెలివితేటలు కూడా విపరీతంగా పెరిగి  కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతే కాకుండా కష్టపడి పని చేయడం వల్ల వీరు ఉన్నత శిఖరాలకు కూడా చేరుకుంటారు. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులతో జీవితంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కష్టపడి పనులు చేసేవారు భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. సింహరాశి వారి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News