)
Golden Cobra Viral Video: శనివారం నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. ఇంటిల్లిపాది ఆలయాలకు వెళ్లి నాగదేవతల పుట్టలో పాలు, చలిమిడి వంటివి ప్రసాదంగా ఉంచి.. నాగదేవతల అనుగ్రహం పొందారు. ఆ రోజున పాములను దైవంగా పూజించడం హిందూ సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ క్రమంలో ఓ నాగుపాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందో మీరూ ఓ లుక్కేయండి.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. అందులోని ఓ నాగుపాము ఎన్నడూ కనిపించని వర్ణంలో కనిపిస్తూ ధగధగ మెరిసిపోతుంది. బంగారపు రంగు కాంతితో ఆ పాము విప్పిన పడగ వజ్రంలా మెరిసిపోతుంది. అది కూడా నాగదేవతకు ఎంతో ఇష్టమైన కార్తిక చవితి (నాగుల చవితి) నాడు ఈ వీడియో వైరల్ గా మారింది. పాము తలలో నాగమణి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ఈ విధంగా వాటిపై కాంతి పడిన క్రమంలో అవి వజ్రంలా మెరిసిపోతాయని కొందరు నెటిజన్లు నమ్ముతారు.
అయితే సాధారణ పాముల్లా కాకుండా ఆ నాగుపాము విప్పిన పడగలో రెండు వైపుల మాత్రమే వజ్రంలా మెరిసిపోతుండడం అందుకు విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది. ఆ వింతైన నాగుపామును చూసేందుకు జనం క్యూ కట్టారు. దాని రంగు చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే సూర్యకాంతి సరాసరి ఆ పాము తలపై పడడం వల్ల ఆ పాము అలా కనిపిస్తుందని కొందరు వాదిస్తున్నారు. మరికొందరైతే పాములు శక్తిమంతమైన నాగమణిని తలపై ధరించి ఉండడం వల్ల ఆ పాము కాంతి పడి అలా వజ్రంలా మెరిసిపోతుందని భావిస్తున్నారు. మరికొందరు నిపుణులు మాత్రం జన్యుపరమైన మార్పుల కారణంగా ఆ పాము పడగ భాగం కాంతితో మెరిసిపోతుందని అభిప్రాయపడుతున్నారు.
హిందువులు ఎంతో విశేషంగా నాగదేవతను పూజించే రోజు నాగుల చవితి రోజున ఈ పాము కనిపించడం వల్ల సాక్ష్యాత్తూ ఆ నాగదేవతే ఈ పాము రూపంలో దర్శనం ఇచ్చిందని కొందరు భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూడడం తమ అదృష్టమని వారు భావిస్తున్నారు. వారంతా లైక్స్, కామెంట్స్, షేర్స్ చేస్తుండడం వల్ల ఆ వీడియో మరింత వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook