)
Sun Transits 2025 Effect On Zodiac Telugu News: గ్రహాలకు రారాజైన సూర్యుడు శక్తివంతమైన ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకువస్తుంది. అలాంటి గ్రహం నవంబర్ 19వ తేదీన అనురాధ నక్షత్రం లోకి ప్రవేశించబోతోంది. డిసెంబర్ రెండవ తేదీ వరకు ఈ గ్రహం అక్కడే ఉంటుంది. శని అనురాధ నక్షత్రానికి అధిపతిగా వ్యవహరిస్తాడు.. అలాంటిది సూర్యుడు ప్రవేశించడం వల్ల ఈ సమయంలో ఏర్పడే ప్రభావం కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశుల వారికి జీవితంలో సానుకూలమైన మార్పులు రాబోతున్నాయి. వృత్తిపరమైన జీవితంలో పురోగతి కూడా లభించబోతోంది. ఈ సమయంలో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే సూర్యుడి మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి చాలా వరకు కలిసి రాబోతోంది. సూర్యుడి నక్షత్ర సంచార ప్రభావం ఏయే రాశుల వారికి విజయాన్ని అందిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్..
వృశ్చిక రాశి
సూర్యుడి సంచార ప్రభావం వృచ్చిక రాశి వారికి చాలా కీలకమైందిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా భూమితో పాటు కొత్త ఇంటికాలను నెరవేర్చుకోబోతున్నారు. అలాగే భార్యాభర్తల నుంచి మంచి సపోర్టు లభించబోతోంది. ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని. ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా అదృష్టం పూర్తిగా ప్రకాశించి కొత్త ఆదాయ మార్గాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ నవంబర్ నెలతో పాటు డిసెంబర్ నెల కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సూర్యుడి సంచారం(sun transits) ఎన్నో అనుకూలమైన మార్పులను తీసుకురాబోతోంది. అలాగే పనుల్లో ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనుల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమై.. అదృష్టం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భారీ మొత్తంలో ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచార (sun transits 2025) ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఆదాయ వనరులు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కోర్టు సంబంధిత కేసుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు ఆస్తి సంబంధిత సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. సంపాదన తో పాటు ఆస్తులు కూడా పెరుగుతాయి.
(నోట్: ఇక్కడ రాసిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమాచారాన్ని జీ తలుగు న్యూస్ ధృవీకరించదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook