Golden Saree To Goddess Sita: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారాముల ఆలయం కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీ సీతారాముల కల్యాణం చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. కోట్లాది మంది భక్తులు ఎదురుచూసే ఆ కల్యాణానికి ఓ చేనేత కళాకారుడు అద్భుతమైన కానుక అందించాడు. సీతమ్మ తల్లికి బంగారు చీరను నేసి సమర్పించాడు. కల్యాణం సందర్భంగా సీతమ్మ తల్లి సిరిసిల్ల బంగారు పట్టు చీరలో ధగధగలాడనున్నారు. మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన బంగారు చీర విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sri Rama Navami: భద్రాచలం సీతారాముల కల్యాణానికి వేళాయే.. కోట్లాది భక్తుల ఎదురుచూపులు
సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత కళారంగంలో విశేష గుర్తింపు పొందాడు. చేనేత రంగంలో ఎన్నో ప్రయోగాలు చేయడంతోపాటు చీరలను కొత్త తరహాలో నేయిస్తుంటాడు. ప్రతియేటా మాదిరి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణానికి మరో చీర అందించాడు. కల్యాణం సందర్భంగా సీతమ్మ తల్లికి ప్రత్యేకంగా బంగారు పట్టు చీరను వెల్ది హరిప్రసాద్ నేశాడు.
చీర ప్రత్యేకతలు
- చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం వినియోగం
- 800 గ్రాముల బరువు ఉండగా.. పొడవు ఏడు గజాలు
- చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూలవిరాట్ దేవతామూర్తులు వచ్చారు. చీర కింది అంచులో శంఖు, చక్రనామాలు, హనుమంతుడు , గరుత్మంతుడు కొలువుదీరారు.
- చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం 51 సార్లు వచ్చేలా రావడం విశేషం
- పది రోజులుచీర నేయడానికి పట్టిన సమయం
Also Read: Ramayan: రామాయణం ఎందుకు చదవాలి? ఆసక్తికర రహాస్యాలు ఇవే!
సిరిసిల్లకు చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేత కళారంగానికి విశేష సేవలు అందిస్తున్నాడు. అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ ప్రముఖుల ప్రశంసలు పొందుతున్నాడు. ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి, దేవాదాయ శాఖకు అందించి, చేనేత కళను ప్రోత్సహించాలని కళాకారుడు వెల్ది హరిప్రసాద్ కోరుతున్నాడు. ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టువస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాడు. మూడేళ్లుగా సీతారాముల కల్యాణానికి ప్రత్యేకమైన చీరలు తయారు చేస్తున్నట్లు వెల్ది హరి ప్రసాద్ తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









