Guru Mangala Yoga: పవర్‌ ఫుల్‌ గురు మంగళ యోగం.. 3 రాశులవారు జాక్‌ పాట్‌ కొట్టడం ఖాయం..!

Guru Mangala Yoga Benefits:  రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగా గురు మంగళ యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందో లేదో చూడండి.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Jul 5, 2024, 11:52 AM IST
Guru Mangala Yoga: పవర్‌ ఫుల్‌ గురు మంగళ యోగం.. 3 రాశులవారు జాక్‌ పాట్‌ కొట్టడం ఖాయం..!

Guru Mangala Yoga Benefits: జోతిష్యశాస్త్ర ప్రకారం, రాశుల్లో రెండో రాశి అయిన వృషభంలోకి కుజ గ్రహం ప్రవేశించబోతుంది. ఈ రాశిలో ఇప్పటికే బృహస్పతి గ్రహం ఉంది. ఈ రెండు గ్రహల కలయిక  12 ఏళ్ల తర్వాత జరగబోతుందని జోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి, కుజుడు ఒకే రాశిలో ఉండటం వల్ల  ఎంతో శక్తివంతమైన గురు మంగళ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశలవారికి పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వృత్తి, విద్య, వైద్య రంగాల్లో పనిచేసేవారికి శుభవార్తులు అందుకుంటారు.  ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో చేరడం వల్ల శుభ ఫలితాలు, అర్థిక లాభాలు, భూ లాభాలు వంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్‌ చేసుకోండి.

Add Zee News as a Preferred Source

మేషరాశి:
మేషరాశి వారికి బృహస్పతి, కుజుడు కలయిక కారణంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఈ రాశుల కలయిక వల్ల వస్తువు, వాహన కూడా కొనుగోలు చేస్తారు. అకస్మాత్తుగా నిలిచిపోయిన పనులు, డబ్బు తిరిగి పొందే అవకాశం పుష్కలంగా ఉంటుంది.  ఈ రాశి వారు కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయలను పొందుతారు. వీరికి వ్యాపారంలో బోలెడు లాభాలు కలుగుతాయి.  ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి పురోగతి లభిస్తుంది.

కన్యా రాశి: 
కన్యారాశి వారికి ఆదాయం పరంగా ఎలాంటి లోటు ఉండదని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశివారికి అడుగడుగునా అదృష్టం వరిస్తుంది. దీని వల్ల  అనుకున్న పనులను ముందుగానే పూర్తి చేస్తారు. ఈ యోగం కారణంగా విద్యార్థలు విదేశాలకు వెళ్లే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారికి, వృత్తి ఉన్నవారికి మంచి పురోగతిని సాధిస్తారు. మొత్తానికి ఈనెల కన్యారాశి వారు అన్ని విధాలుగా లాభాలను పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి:
రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చికం. బృహస్పతి, కుజుడు కలయిక వల్ల  ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారని జోతిష్యనిపుణులు చెబుతున్నారు. వివాహ ప్రయత్నాలకు  ఇది శుభ సమయంగా భావించవచ్చు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు పొందుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు యోగ ప్రభావంతో మానసికంగా, శారీరకంగా  మెరుగుపడుతారు. 

Read more: Cycling Benefits: రోజూ సైకిల్‌ తొక్కితే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News