Guru Pushya Yoga 2023 date and time: ఆస్ట్రాలజీలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గురువారం పుష్య నక్షత్రం రాగానే గురు పుష్య యోగం ఏర్పడుతోంది. దీనినే గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు. ఈ ఏడాది చివరి గురు పుష్య యోగం డిసెంబరు 29న రాబోతుంది. ఈ యోగ సమయంలో ఏ కార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుంది. గురు పుష్య నక్షత్రం రోజు షాపింగ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ సంవత్సరం గురు పుష్య నక్షత్రం 2023 తేదీ, శుభ సమయం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు పుష్య నక్షత్రం శుభ సమయం
గురు పుష్య నక్షత్రం డిసెంబరు 29న ఉదయం 01:05 గంటలకు ప్రారంభమై.. 30 డిసెంబర్ 2023న తెల్లవారుజామున 03:10 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 29న రోజంతా షాపింగ్ చేయడానికి చాలా అనుకూలమైన సమయం.
గురు పుష్య నక్షత్రం యొక్క ప్రాముఖ్యత
గురు పుష్య యోగంలో బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిది. ఈ రోజున గోల్డ్ పై పెట్టుబడి పెడితే అది మీకు చాలా రెట్లు లాభాన్ని ఇస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి సమయం. సాధారణంగా గురు పుష్య నక్షత్రం ఏడాదికి రెండు లేదా మూడు సార్లు ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన రోజున హిందువులు లక్ష్మీదేవిని పూజించి.. తల్లి ఆశీస్సులు పొందుతారు. అంతేకాకుండా ఈ రోజున అమృత యోగం కూడా ఏర్పడుతుందని కొందరి నమ్మకం. 
ఈ పనులు చేయడం శుభప్రదం
** కొత్త పనులు ప్రారంభించడం, ల్యాండ్, భవనాలు, వాహనాలు, బంగారు వెండి ఆభరణాలు, పుస్తక ఖాతాలు మొదలైన వాటి కొనుగోలుకు గురు పుష్య యోగం ఉత్తమమైనదిగా భావిస్తారు.
**పుష్య నక్షత్రంలో బృహస్పతికి సంబంధించిన బంగారం, ఇత్తడి ఏనుగు, దక్షిణావర్తి శంఖం వంటి వాటిని కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది.  
**మీరు గురు పుష్య యోగం రోజున షాపింగ్ చేయలేకపోతే శ్రీ సూక్తాన్ని పఠించండి.


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Shukra Gochar: 2024లో ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook