Guru Transit 2025 Effect On Zodiac: గురువు, పిల్లలు, జ్ఞానం, విద్యా, సంపద, ధనం పెరుగుదలకు కారకుడిగా భావించే బృహస్పతి బుధవారం కదలికలు జరిపాడు. దేవతలకు గురువుగా భావించే బృహస్పతి మే 14వ తేదీన వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రవేశించాడు. అయితే ఈ గ్రహప్రవేశం అనేది అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే గురు గ్రహానికి ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే గురువు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది.
బృహస్పతి సంఖ్య కొన్ని రాశుల వారికి మేలు జరిగితే మరికొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతకంలో అశుభ స్థానంలో ఈ గ్రహం ఉన్నవారికి ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. అలాగే ఆర్థికంగా కూడా దెబ్బతిని చాన్స్ ఉంది. సమయంలో ఆరోగ్యం పై కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది.
బృహస్పతి మే 14 తెల్లవారి జామున రెండు గంటలకు మిధున రాశిలోకి ప్రవేశించాడు. అయితే దీనికి కారణంగా జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఈ రోజు నుంచి ఎంతో మేలు జరుగుతుంది. గురు గ్రహం వల్ల ఏయే రాశుల వారికి ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
బృహస్పతి సంచారం వల్ల ధనస్సు రాశి వారికి ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రతి పనిలో విజయం సాధించగలిగే అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి ప్రతి పనిలో పెద్దపెద్ద మార్పులు వస్తాయి. ఒత్తిడి నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. ఉద్యోగాలు చేసే వారు కొత్త ఆదాయం కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అదృష్టం సహకరిస్తుంది. బృహస్పతి వీరికి అనుకూల స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అలాగే ప్రతి పనిలో విజయం సాధించే అద్భుతమైన శక్తిని పొందుతారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల అద్భుతమైన అవకాశాలు పొందుతారు.
తులారాశి
మహారాష్ట్రలో జన్మించిన వ్యక్తులకు కూడా బృహస్పతి సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. వృతి జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పదోన్నతులు కూడా లభిస్తాయి. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి