Guru Planet Transit 2025 Effect On Zodiac In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో సానుకూల ప్రభావాన్ని అందించే గ్రహాల్లో దేవగురు బృహస్పతి గ్రహం ఒకటి. ఈ గురు గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ గ్రహం రాశి సంచారం చేయడమే కాకుండా నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత గ్రహం నక్షత్ర సంచారం చేస్తుంది. కాబట్టి దీని వల్ల కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మృగశిర నక్షత్రంలో గురు గ్రహం సంచారం చేయడం వల్ల సింహ రాశితో పాటు మరి కొన్ని రాశులవారి జీవితాల్లో ప్రత్యేకమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ కింది రాశులవారికి అనుకున్న పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. అయితే ఈ సమయంలో అత్యంత లాభాలు పొందే రాశులేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
గురు గ్రహం ప్రభావంతో వృశ్చిక రాశివారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయం నుంచి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే కొంత కాలంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఇప్పటికే మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
సింహరాశి
సింహ రాశివారికి గురుగ్రహ ప్రభావం వల్ల సానుకూల ప్రభావం ప్రారంభమవుతుంది. వీరికి ఆదాయంలో పెద్ద మార్పులు వస్తాయి. అంతేకాకుండా సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్‌తో పాటు భారీ లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే సింహ రాశివారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలు కూడా లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి భారీ ప్రయోజనాలు కలుగుతాయి.
తుల రాశి
మృగశిర రాశిలోకి బృహస్పతి ప్రవేశించడం వల్ల తులా రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలు చేసేవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









