Hanuman Favourite Zodiac Signs: హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రాశుల వారు వీరే.. వీరికి ఊహించని జాక్పాట్..

Hanuman Favourite Zodiac Signs: కొన్ని రాశుల వారు ప్రతి మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని వారంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా హనుమంతుడి అనుగ్రహం పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 26, 2025, 03:33 PM IST
Hanuman Favourite Zodiac Signs: హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రాశుల వారు వీరే.. వీరికి ఊహించని జాక్పాట్..

Hanuman Favourite Zodiac Signs: హిందువులు అన్ని దేవుళ్ళతో పోలిస్తే ఎక్కువగా హనుమంతుడిని పూజిస్తారు. ప్రతి మంగళవారం ఉదయాన్నే తల స్నానం చేసి హనుమంతుడి దేవాలయాన్ని సందర్శిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడిని ధైర్యం, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు అందుకే ఆయనను పూజించడం వల్ల జీవితంలో ఎన్నో రకాల విజయాలు కలుగుతాయని ఒక నమ్మకం. ముఖ్యంగా ఆయనను పూజించడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంతో పాటి శ్రేయస్సు లభిస్తుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. 

Add Zee News as a Preferred Source

హనుమంతుడు కొన్ని రాశుల వారిపై కూడా ఎల్లప్పుడూ ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపుతాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. హనుమంతుడి అనుగ్రహం నాలుగు రాశుల వారు ఎలాంటి సమయంలోనైనా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో సింహరాశి కూడా ఒకటి.. ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం లభించి కష్టాల నుంచి విజయం దిశగా ముందుకు వెళ్తారు. అలాగే ఎల్లప్పుడూ డబ్బు సంబంధిత సమస్యల నుంచి కూడా పరిష్కారం పొందుతారు. శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహ రాశి వారు ఎల్లప్పుడూ ఊహించని ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు..

వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆ హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుంది. వీరు కష్టాల నుంచి సులభంగా బయటపడతారు. ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా హనుమంతుడి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా సమస్యలు కూడా తొలగిపోతాయి.

మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎల్లప్పుడూ వాయు పుత్రుడు అనుగ్రహం లభిస్తుంది. వీరు బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా అద్భుతమైన శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. హనుమంతుడి అనుగ్రహం వల్ల మేషరాశి వారికి ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే కష్టాలు కూడా గట్టెకుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆ వాయు పుత్రుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి ఆయన అనుగ్రహంతో ఉద్యోగాలపరంగా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే వీరు విశేషమైన ప్రయోజనాలు పొందుగలుగుతారు. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడి మంత్రాలను పారాయణం చేయడం కుంభ రాశి వారికి ఎంతో మేలు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News