Hanuman jayanti tradition and puja vidhan: ప్రస్తుతం దేశ మంతట కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే హనుమయ్య ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం మనం శనివారం రోజున అంటే ఏప్రిల్ 12న చైత్రశుధ్ద పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం.
ఈ క్రమంలో చాలా మంది కేసని, అంజనా దేవీల ముద్దుల కొడుకు ఆంజనేయుడ్ని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. కొంత మంది వాయుపుత్రుడు, మారుతి అని, హనుమంతుడు, కేసరి నందనుడు, వీరాంజనేయుడు, బజరంగ్ బలి, పవన సుతుడు, మహా వీరుడు అని వివిధ రకాల పేర్లతో పూజించుకుంటారు. అయితే.. ప్రస్తుతం ఆంజనేయ స్వామి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంజనేయుడు జన్మరహస్యం..
కేసరి, అంజనాదేవీలు శివుడి కోసం ఘోరంగా తపస్సు చేసి తమకు సంతానం కావాలని వరం కోరుకుంటారు . దీంతో శివుడి తన అంశతో గొప్ప శక్తి కల్గిన కుమారుడు పుడతారని వరం ఇస్తాడు . శివుడి వర ప్రభావం వల్ల కేసరి, అంజనా దేవీలకు పుత్రుడు జన్మిస్తాడు. ఆయన పుట్టుకతోనే అనేక శక్తులు కల్గి ఉంటాడు. ఒక రోజు బాల్యంలో ఉయ్యాలలో వాకిట్లో పడుకుని ఉండగా.. ఆకాశంలో సూర్యుడ్ని చూస్తాడు. ఎర్రగా ఉండటంతో.. అదేదో ఫలం కాబోలు అని వెంటనే ఆకాశంలో బాల హనుమాన్ ఎగిరి సూర్యుడ్ని సమీపించడానికి వెళ్తుంటాడు.
ఇంతలో అప్పటికే సూర్యగ్రహాణం కావడంతో.. రాహువు తాను సూర్యుడ్ని మింగక ముందు.. ఒక బాలుడు సూర్యుడ్ని మింగేందుకు వేగంగా వస్తున్నాడని దేవ రాజు ఇంద్రుడి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకుంటాడు. ఇంతలో ఇంద్రుడు తన చేతిలోని వజ్రాయుధంను బాలుడి మీద ప్రయోగిస్తాడు.అది నేరుగా వచ్చి.. బాల ఆంజనేయుడి హనువు (దవడ)కు తాకుతుంది.
దీంతో బాల ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అమ్మా..అంటూ.. ఆకాశంలో నుంచి భూమి మీదకు పడిపోతుంటాడు. ఇంతలో వాయుదేవుడు బాల ఆంజనేయుడ్ని కాపాడి.. ఒకగుహలోకి తీసుకెళ్లి సపర్యలు చేస్తాడు. ఆంజనేయ స్వామి మీద ఇంద్రుడు ఆయుధం వేసినందుకు.. వాయుదేవుడు విశ్వమంతా గాలి వీచకుండా ఆపేస్తాడు. దీంతో విశ్వం అంతా స్తంభించి పోతుంది. చివరకు దేవతలు, రుషులు వచ్చి.. వాయుదేవుడికి నచ్చ చెప్పి, ఆంజనేయ స్వామి కోలుకునేలా ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడు ఆంజనేయుడు కోలుకుంటాడు.
Read more: Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..?.. విశిష్టత.. పూజా విధానం ఏంటంటే..?
ఇంద్రుడి వజ్రాయుధం వల్ల.. ఆంజనేయ స్వామి దవడ (హనువు) తీవ్రంగా గాయపడింది కాబట్టి.. ఆంజనేయుడు హనుమంతుడు అనే పేరుతో సార్థకతను పొందుతాడని ఇంద్రుడు వరమిస్తాడు.అదే విధంగా మిగత దేవతలు, రుషులు సైతం ఆంజనేయ స్వామికి అనేక వరాలను కూడా ఇచ్చి.. లోకకళ్యాణం కోసం హనుమ భవిష్యత్తులో ఎన్నో కార్యాలు ముందుండి నడిపిస్తాడని కూడా రుషులు హనుమను, కేసరి, అంజనా దేవీలకు రుషులు వరాలను ఇస్తారు. ఈ విధంగా ఆంజనేయ స్వామికి అనేక పేర్లు వచ్చాయి. ఈ క్రమంలో ఆంజనేయ స్వామి జయంతి రోజున హనుమను.. చాలా మంది భక్తితో కోలుచుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









