Hessonite Stone Benefits: గోమేధికం రత్నాన్ని ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి, దీని వల్ల కలిగే లాభాలు, దుష్ప్రభావాలు!
Hessonite Stone Benefits: గోమేధికం రత్నాన్ని వెండి ఉంగరంతో ధరించడం వల్ల జీవితంలో చాలా రకాల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Hessonite Stone Benefits: రత్న శాస్త్రం ప్రకారం గోమేధికం రత్నానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అంతేకాకుండా ఈ రాత్నాన్ని రాహువు గ్రహానికి సంబంధించిన రత్నంగా కూడా సూచిస్తారు. దీనిని ధరించడం వల్ల శనిదోషమే కాకుండా రాహువు గ్రహం కారణంగా ఏర్పడే చెడు ప్రభావం కూడా సులభంగా తొలగిపోతుందని రాత్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రాహువు మహాదశ దుష్ప్రభావాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు తప్పకుండా ఈ రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. అయితే దీనిని ధరించే ముందు తప్పకుండా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సలహాలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రత్నాన్ని శుభ సమయాల్లో ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గోమేధికం రత్నాన్ని ఎవరు ధరించాలి:
గోమేధికం రత్నాన్ని న్యాయవాదులు, డిటెక్టివ్, రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ధరించడం వల్ల శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా మిథునం, తుల, మకరం, కుంభం లేదా వృషభ రాశి వారు కూడా గోమేధికాన్ని ధరించవచ్చు. అంతేకాకుండా ఎవరి జాతకంలో రాహువు ఉచ్ఛస్థితిలో ఉంటుందో..అలాంటి వ్యక్తులు ఈ గోమేధికం రత్నాన్ని ధరించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
దీంతో పాటు జాతకంలో రాహువు మొదటి, నాల్గవ, పంచమ, సప్తమ, తొమ్మిదవ స్థానంలో ఉన్నవారు కూడా గోమేధిక రత్నాన్ని ధరించడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి రాహువు కారణంగా కలిగే దుష్ప్రభావాల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా రాహువు చెడు ప్రభావం కారణంగా తీవ్ర సమస్యలతో బాధపడేవారు ఈ రత్నాన్ని తప్పకుండా ధరించాల్సి ఉంటుంది.
ఏయే సమయాల్లో ఈ రాత్నాన్ని ధరించాలి:
ఈ గోమేధిక రత్నాన్ని ధరించాలనుకునేవారు వెండి ఉంగరంలో పెట్టి ధరించాల్సి ఉంటుంది. దీంతో పాటు దీనిని శనివారం ధరించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రత్నాన్ని ధరించే ముందు గంగాజలం, పాలు, తేనెతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 'ఓం రాన్ రహవే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించి..ధరించడం వల్ల రాహువు దుష్ప్రభావం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి