Holi festival astrological remedies: హోలీ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. అయితే.. మనం ఈసారి హోలీ పండగను మార్చి 14న శుక్రవారం రోజున జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో హోలీకి ముందు రోజున కాముడు అనే పండుగను నిర్వహించుకుంటారు. ముఖ్యంగా హోలీ రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే జీవితంలో ఎల్లప్పుడు కూడా డబ్బులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
హోలీ రోజున ఉదయాన్నే నిద్రలేచీ దైనందీక కార్యక్రమాలను పూర్తి చేసుకొవాలి. ఆ తర్వాత అదే విధంగా ఈ రోజున ముఖ్యంగా చేయాల్సిన పనులు గురించి పండితులు కొన్ని విషయాలు చెబుతున్నారు. ఈ క్రమంలో హోలీ రోజున ముఖ్యంగా పండ్లను దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా.. ఈ రోజున పేదలకు వస్త్రదానం చేయాలి. సమ్మర్ సీజన్ నడుస్తొంది.
కాబట్టి ఈ రోజున పేదలకు గొడుగు, చెప్పులను దానంగా ఇవ్వాలి. కుండలు, చలికేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే ఆ దేవుడి అనుగ్రహాం కల్గుతుందని చెబుతారు. అదే విధంగా హోలీ రోజున బియ్యం, నవధాన్యాలను పురోహితులకు దానంగా ఇవ్వాలంట. ఈ విధంగా చేస్తే జాతకంలో ఉన్న సమస్యలన్ని కూడా పోతాయంట. ప్రస్తుతం హోలీ నేపథ్యంలో చాలా మంది రంగుల్ని పెట్టుకుని , చాలా నీళ్లను వెస్ట్ చేస్తుంటారు.
కానీ నీళ్లను మాత్రం అస్సలు వెస్ట్ చేయకూడదంట. నీళ్లను వెస్ట్ చేస్తే వరుణుడి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే నీళ్లను వెస్ట్ చేయోద్దని పండితులు సూచిస్తున్నారు. హోలీ రోజున తలవెంట్రుకలు తీసుకొవడం, గోర్లు కట్ చేసుకొవడం వంటి పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఈరోజును పెదలకు స్వీట్ లను పంచిపెట్టాలని చెబుతున్నారు. ఇలాంటి పనులు చేస్తే అలాంటి వారికి డబ్బులకు అస్సలు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









