
Holi Significance: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రంగుల్లో తడిసి ముద్దవుతారు. హోలీనే హోళికా పూర్ణిమ లేదా కాముని పున్నమిగా పిలుస్తుంటారు. క్షీరసాగర మధనం నుంచి శ్రీ మహాలక్షి ఉద్బవించిన రోజు కూడా ఇదే కావడంతో మరింత ప్రాధాన్యత ఉంటుంది. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారనే విషయంలో ఓ పురాణ గాథ కూడా ఉంది.
హోలీ వెనుక గాథకు హిరణ్యకశ్యపుుడు వర్సెస్ ప్రహ్లాదునికి మధ్య సంబంధం ఉంది. హిరణ్యకశ్యపుడు విష్ణు ద్వేషి అయితే ప్రహ్లాదుడు అపర భక్తుడు. అగ్నితో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండే వరాన్ని పొంది ఉన్న హిరణకశ్యపుడి సోదరి హోళికాతో ప్రహ్లాదుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. అలా చేస్తే ప్రహ్లాదుడు మరణిస్తాడని హోళికాకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని హిరణకశ్యపుడు భావిస్తాడు. కానీ అదే అగ్నిలో హోళీకా దహనం కాగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటికొస్తాడు. ఈ ఘటనకు సంకేతంగా హోళికా దహనం చేస్తారు. ఇక హోలీ నాడు రంగులు చల్లుకోవడం వెనుక కూడా మరో కథ ప్రచారంలో ఉంది. పాలమీగడ వంటి రంగు కలిగిన రాధను చూసి కన్నయ్య చిన్నబుచ్చుకోవడంతో యశోద రాధ ముఖానికి రంగు పులిమిందంటారు. అప్పటి నుంచి ఈ రోజున ఒకరిపై మరొకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ రెండూ కాకుండా మరో కధ కూడ ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో సూర్య వంశానికి చెందిన రఘునాథ అనే రాజు పాలిస్తున్న సమయంలో హోళికా అనే రాక్షసి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటుంది. రాక్షసి నుంచి కాపాడమంటూ ప్రజు రాజును వేడుకోగా అక్కడే ఉన్న నారదుడు ప్రతి ఏటా ఫాల్గుణ పూర్ణిమ నాడు హోళికను పూజిస్తే సమస్యల నుంచి బయటపడతారని చెప్పడంతో అప్పటి నుంచి ఇది జరుగుతూ వస్తోందని అంటారు.
అయితే హోలీ రంగులు ఎప్పుడూ సహజసిద్ధమైనవిగా ఉండాలి. ప్రకృతిలో లభించే మోదుగ, బంతి పూలు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకులతో తయారు చేసుకునే రంగులే చల్లుకోవాలి. ఇవి కాకుండా మార్కెట్లో లభించే కెమికల్స్ ఉండే రంగులు చల్లుకుంటే చర్మానికి హాని కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి