Horoscope Today: నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Telugu: పన్నెండు రాశుల వారికి నేడు (శుక్రవారం) ఎలా ఉందో.. జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 06:03 AM IST
Horoscope Today: నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope prediction today: నేడు పన్నేండు రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం

26 నవంబర్ 2021 (శుక్రవారం)

సూర్యోదయం ఉదయం 6:14 గంటలకు

సూర్యాస్తమయం సాయంత్రం 5:24 గంటలకు

తిథి- కార్తీక బహుళ సప్తమి రాత్రి 12:27 గంటల వరకు తదుపరి కార్తీక బహుళ అష్టమి

నక్షత్రము: ఆశ్లేష సాయంత్రం 4:38 గంటల వరకు తదుపరి మఘ

వర్జ్యం: ఉ.6:14 నుండి 8:30 వరకు

దుర్ముహూర్తం: ఉదయం 8:22 గంటల నుంచి 9:07 గంటల వరకు తదుపరి మ.12:06 నుంచి 12:53 వరకు

రాహుకాలం: ఉదయం 10:30 గంటల నుంచి 12:00 గంటల వరకు

యమగండం: మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

అమృతఘడియలు: మధ్యాహ్నం 2:57 గంటల నుంచి సాయంత్రం 4:39 గంటల వరకు

రాశిఫలాలు..

మేష రాశి (Aries)

ఈ రాశి వారికి నేడు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేముందు పెద్ద వాళ్ల ఆశ్విర్వాదం తీసుకోవడం కలిసి వస్తుంది. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యాలయా ఉద్యోగులు ఉత్సాహంగా పని పూర్తి చేయగలుగుతారు. పెళ్లైన వారు జీవిత భాగస్వామితో ఎప్పుడో జరిగిన విషయంపై గొడవ పడే అవకాశం ఉంది.

వృషభ రాశి ( Taurus)

ఈ రాశి వారికి నేడు ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముదుకు సాగే అవకాశం ఉంది. వ్యాపారులు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ధనం విషయంలో జాగ్రత్త పాటించాలి. సమాజంలో పేరు పొందే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొత్త వెంచర్లు మొదలు పెట్టొచ్చు.

మిథున రాశి (Gemini)

క్లిష్ట పరిస్థితులను తెలివితో ఎదుర్కొంటారు. అది ప్రశంసలకు కారణం అవుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్త అవసరం. తగినంత డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. వ్యాపార పరంగా మాత్రం కొత్త  ప్లాన్స్​ గురించి చెప్పేందుకు ఇది మంచి సమయం.

కర్కాటక రాశి (Cancer)

ఈ రాశి వారికి నేడు సంతోషంగా గడుస్తుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కుబుంబ సభ్యులు, స్నేహితులతో గడపడం మంచిది. అయితే ఆర్థికంగా వచ్చే లాభాన్ని ధన ధర్మాలకు వినియోగిస్తారు. ధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో వచ్చే విభేధాల వల్ల.. ఇబ్బందులు ఉంటాయి.

సింహ రాశి (Leo)

వ్యాపారుల నేడు జాగ్రత్త వహించాలి. వ్యాపార భాగస్వామితో విభేధాలకు అవకాశముంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం మీకు ప్రశాంతతనిస్తుంది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే అవకాశముంది. జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశాలున్నాయి.

కన్యా రాశి (Virgo)

ఈ రాశి వారు వ్యక్తిగతంగా, తల్లి దండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అవసరం. సంపద ఉన్నా ఖర్చుల వల్ల అది నిలబడదు. బంధువుల నుంచి ఓ మంచి వార్త వింటారు. ఇది మీకు ఉత్సాహనిస్తుంది. పనులు చేయాలనుకున్నా.. ఆటంకాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో నేడు శుభ దినంగా ఉంటుంది.

తులా రాశి (Libra)

విశ్రాంతి లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అయితే ఖర్చుల వల్ల ధనం నిలబడదు. వాస్తవ పరిస్థితులకు తగ్గట్లు నడుచుకోవడం ఉత్తమం. స్నేహితులతో సమయం గడపడం వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారాలు కొత్త ప్రాజెక్ట్​లు, ప్లాన్స్​ను అమలు చేసేందుకు ఇది మంచి రోజు.

వృశ్చిక రాశి (Scorpio)

జీవితం పట్ల సానుకూల ధోరణి పెంచుకోవాలి. స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం గానీ, నిరాశ  చెందటం కానీ చేయకూడదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి నష్టాలు వచ్చే అవకాశముంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామితో గొడవలకు అవకాశముంది.

ధనుస్సు రాశి (Sagittarius)

వినోదాలు, సరదాలతో రోజు గడుస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితులు మీకు డబ్బు విలువ తెలిసేలా చేస్తాయి. తల్లి, తండ్రులతో కఠినంగా వ్యవహరించి.. వారి ప్రశాంతతను చెడగొట్టే అవకాశముంది. కొందరిని కలిసి మ్టాలాడటం వల్ల మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.

మకర రాశి (Capricorn)

మీ తాహత్తుకు మించి ఏదైనా పని, మాట సహాయం గాని చేయకపోవడం మంచిది. ఉమ్మడి వ్యాపారాల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న తగాదాలు చికాకు తెప్పిస్తాయి. వాటి వల్ల అవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. పెట్టుబడులు ఆకర్షణీయ ఫలితాలనిస్తాయి. వైవాహిక జీవితంలో అనందంగా గడుస్తుంది.

కుంభ రాశి (Aquarius)

మీ వ్యసనాల వల్ల మీకు.. ప్రమాదం ఉంది. మీ స్వభావం వల్ల ఏర్పడే పరిచయాలు కొత్త స్నేహితులను సృష్టిస్తుంది. మీ వల్ల మీ జీవత భాగస్వామి ఆందోళన పడే అవకాశాలున్నాయి. ఆఫీలల్లో పని చేసే వారు అలసటగా ఫీలవుతారు. పెట్టుబడులు ఫలితానిస్తాయి.

మీన రాశి (Pices)

ఆరోగ్యం కాపాడుకునేందుకు తగినంత సమయం లభిస్తుంది. జాగ్రత్తగా ప్రయత్నిస్త అదనపు ఆదాయం లభిస్తుంది. గొడవలకు చోటివ్వొద్దు. వైద్యులకు, న్యాయవాదులకు కలిసి వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారులకు లాభాలు వస్తాయి సిద్ధిస్తాయి.

Also read: కలల జ్యోతిషశాస్త్రం: పదే పదే మరణించిన వారు కలలో కనపడుతున్నారా..?? అయితే దానికి అర్థం ఇదే!

Also read: సమస్యలతో సతమతం అవుతున్నారా..? జమ్మి చెట్టు ఇంట్లో నాటితే అన్ని కష్టాలు తొలగిపోతాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

More Stories

Trending News