)
Ramayana Secrets In Telugu: రామాయణంలో ఒక్కో పాత్ర ప్రత్యేకం. వాటిలో ప్రధాన పాత్రలు రాముడు, సీత, ఆంజనేయుడు, రావణాసురుడితోపాటు అతడి చెల్లెలు శూర్పణఖ ప్రధానం. రామాయణంలో ప్రధాన వృతం జరగడానికి కారణం శూర్పణఖ.. అయితే ప్రధాన విలన్‌గా రావణాసురుడు కనిపిస్తాడు. అలాంటి కీలకపాత్రల గురించి రహాస్యాలు తెలుసా? రామాయణంలో సీతాపహరణం ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎవరు? రామాయణంలో రావణుడికి ఎంత మంది భార్యలు.. అతడి పిల్లలు ఎవరు అనేవి ఆసక్తికరం. శూర్ఫణఖ ఎవరు? రావణాసురుడి సొంత చెల్లెలా అనే రహాస్యం తెలుసుకుందాం.
==> రామాయణంలో రావణాసురుడు, శూర్పణఖ ప్రముఖ పాత్రలు పోషిస్తాయి. ఒక విధంగా అన్నయ్య చావుకు ఆమె కారణమైంది. మొదట శూర్పణఖ అంటే అర్థం తెలుసుకుందాం.
==> శూర్ప + నఖ = శూర్పణఖ. శూర్పము అంటే చాట. చాట వంటి పెద్ద గోళ్లు పెంచుకొన్న ఆమె అనే అర్థం వస్తుంది.
==> శ్రీలంకకు చెందిన శూర్పణఖ తండ్రి విశ్రవసుడు. ఈయనకు నలుగురు భార్యలు.
==> తొలి భార్య ఇలబిల . ఈమె తృణబిందువు అనే ఆయన కూతురు. కుబేరుడు ఈమె సంతానమే. ఈమె వల్ల ఆయనకు ఐలబిలుడు అనే పేరు వచ్చింది.
==> రెండో భార్య కైకసి. ఈమె సుమాలి కూతురు. రెండో భార్య పిల్లలే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వీరే రామాయణంలో ప్రధానంగా కనిపిస్తారు.
==> మూడో భార్య పుష్పోత్కట. కైకసి చెల్లెలే ఈమె. ఈమెకు మహోదరుడు, మహాపార్శ్వుడు సంతానం కలిగారు.
==> నాలుగో భార్య రాక. కైకసి మరో చెల్లెలు. ఈమె కూతురే శూర్పణఖ, కొడుకు ఖరుడు.
తమ్ముడు ధర్మమార్గంలో..
రామయణానికి ప్రధాన కారణమైన శూర్పణఖ అంటే రావణాసురుడికి అంత ప్రేమ ఉండదు. నాలుగో తల్లి కుమార్తె కావడంతో రావణాసురుడికి శూర్పణఖ చెల్లెలు వరుస అవుతుంది. ఈ క్రమంలోనే శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుణ్ణి రావణాసురుడు ఒక యుద్ధంలో చంపేశాడు. పొరపాటున చంపానని చెల్లి శూర్పణఖకు చెబుతాడు. ఇక సొంత అన్నదమ్ముళ్లయనా రావణాసురుడికి విభీషణుడి తప్ప కుంభకర్ణుడు సహాయం చేస్తాడు. ధర్మం.. న్యాయం రాముడి వైపు ఉందని భావించిన విభీషణుడు తన సోదరుడు రావణాసురుడికి కాకుండా రాముడికి మద్దతు ఇచ్చాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.