How many windows is good for a house: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సరైన సంఖ్యలో కిటికీలు ఉండడం చాలా అవసరం. అప్పుడే ఆ ఇంట్లో నివసించే వారు సుఖంగా, సంతోషంగా జీవించగలుగుతారు. అసలు వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని కిటికీలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టేటప్పుడు లేదా కొనేటప్పుడు వాస్తును చూస్తారు. వాస్తు ఎంత బలంగా, లాభంగా ఉంటే ఆ ఇంట్లోని వారు అంత సంతోషంగా జీవిస్తారు. ఇంట్లోని తలుపులు, కిటికీల సంఖ్య కూడా వాస్తు శాస్త్రం నిర్ణయిస్తుంది. ఇంటికి ఎన్ని తలుపులు ఉండాలో, కిటికీలు ఉండాలో ముందే వాస్తు శాస్త్రం వివరించింది. ఒక ఇంట్లో కిటికీలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి కాంతిని, గాలిని ఇంట్లోకి తీసుకువస్తాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం తలుపుల తర్వాత కిటికీలకే ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని స్థిరంగా తీసుకురావడంలో ఇది సహకరిస్తాయి. కిటికీలు సరైన దశలో ఉండడం సరైన సంఖ్యలో ఉండడం కూడా చాలా అవసరం.
ఇక కిటికీలలాగే తలుపులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు లోపల శక్తి, శుభం, సంపద, ఆరోగ్యం పయనించే మార్గం ఇవే. తలుపులు సరిగా లేకపోతే సానుకూల శక్తి సరైన దిశలో ప్రవహించదు. ఇంట్లో ప్రధాన తలుపు దిశ, ఆరంభం, కొలతలు కూడా చాలా ముఖ్యం. ఈ తలుపు సరిగా ఉండకపోతే ఇల్లు లోపల శక్తి అసమతుల్యంగా ఉంటుంది. దాని ప్రభావం ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతిపై పడుతుంది.
ఒక ఇంట్లో ఎన్ని కిటికీలు ఉండాలి..?
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లోని కిటికీల సంఖ్య ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉండాలి. అంటే రెండు 4, 6, 8... ఇలా ఉండాలి. అంతే తప్పా 3, 5, 7... వంటి బేసి సంఖ్యలో ఉండకూడదు. ఇంట్లో సరి సంఖ్యలో కిటికీలు ఉంటే ఆ ఇంటి వాస్తు సరిగా ఉందని అర్థం. అదే బేసి సంఖ్యలో కిటికీలు ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇల్లు నిర్మించేటప్పుడే కిటికీల సంఖ్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రంలో తలుపులు, కిటికీలు సరైన దిశలో అమర్చడం చాలా ముఖ్యం. దీనివల్ల ధనం, సంపద అవకాశాలు ఇంటి లోపలికి ప్రవహిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రధాన తలుపు చిన్నగా ఉంటే సంపద బయటకు పోతుంది. కాబట్టి తలుపులు సరైన కొలతలతో, సరైన దిశలో ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు. అలాగే ఈ సమాచారం కేవలం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
Also Read: Mercury Transits 2026: కక్ష్యలో దిశ మార్చుకోబోతున్న బుధుడు.. ఈ రాశుల వారికి ఊహించని డబ్బు!
Also Read: Shani Blessings: 138 రోజులపాటు ఈ రాశుల వారిపై శని అనుగ్రహం.. వీరు తప్పకుండా గుడ్ న్యూస్ వింటారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









