Vastu Tips For Buddha Statue: ప్రస్తుతం ఇంటి అలంకరణ పట్ల ప్రజల్లో ఎంతో ఆసక్తి పెరిగింది. ఇంటిని అందంగా అలంకరించడానికి వివిధ రకాల బొమ్మలు, ఫొటోలు, హస్తకళలు వంటి వస్తువులను ఉపయోగించడం చాలా కామన్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, పింటరెస్ట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అందమైన ఇంటి అలంకరణ ఫోటోలు పుష్కలంగా కనిపిస్తాయి. ఇవి ప్రజలను తమ ఇళ్లను అలాగే అలంకరించాలనే ఆలోచనకు ప్రేరేపిస్తున్నాయి. ఇష్టమైన బొమ్మలు, ఫొటోలు, హస్తకళలు వంటి వస్తువులను ఉపయోగించడం వల్ల ఇంటికి ఒక ప్రత్యేకమైన టచ్ ఇవ్వవచ్చు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వస్తువులను ఉంచే విధానం చాలా ముఖ్యం. కొన్ని వస్తువులను తప్పుగా ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వచ్చి ఇంట్లో వాతావరణం చెడిపోవచ్చు. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, మనోభావాలపై ప్రభావం చూపించవచ్చు. అందులో సాధారణంగా ఇంట్లో కనిపించే బుద్ధవిగ్రహం ఒకటి. చాలామంది ఇళ్లలో బుద్ధ విగ్రహాన్ని అలంకరణగా ఉంచుకుంటారు. శాంతి, ప్రశాంతతకు ప్రతీకగా భావించే బుద్ధుడి విగ్రహం ఇంటికి సక్రాత్మక శక్తిని తెస్తుందని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలి అనే విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
మార్కెట్లో బుద్ధుడి విగ్రహం రకరకాల విగ్రహాలు వినియోగంలో ఉన్నాయి. నేటికాలంలో చాలామంది బౌద్ధ వృక్షం కింద ఉన్న బుద్ధుడిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటారు. వాస్తు ప్రకారం పితృ స్థానం వచ్చేసి నైరుతి కోణం 22 డిగ్రీలు ఉంటుంది. ఆ కోణంలో విగ్రహాన్ని పెట్టినట్లయితే మంచిఫలితాలు కలుగుతాయి.
కానీ అదే విగ్రహం వేరే స్థానంలో పెడితే నెగిటివ్ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. బుద్ధ భగవానుడు ఇంట్లో ఉత్తర దిక్కున పెట్టుకోవడం వల్ల ధన లాభం కలుగుతుంది. అయితే మార్కెట్లో రెండు పోసేస్ లో బుద్ధవిగ్రహం ఎక్కువగా దొరుకుతుంది. ఒకటి అభయహస్తం, ఇంకోటి మెడిటేషన్ పోజులు దొరుకుతుంది. ముఖ్యంగా మెడిటేషన్ పోజులో ఉన్న బుద్ధ భగవానుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది.
కొన్ని ఇళ్లల్లో బుద్ధుడి విగ్రహం మెడదాకే ఉంటుంది. చాలా మంది ఇంటి అలంకారణలో ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మెడ వరకు ఉండే బుద్దవిగ్రహం పెట్టుకోవడం అసలు మంచిది కాదు. ఇది రాహుకేతులకు సంకేతంగా నిపుణులు భావిస్తారు. బుద్ధుడి విగ్రహం మెడవరకే ఉంటే ఇంట్లో బుధ రాహువు దోషాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పూర్తి ముఖం ఉన్న బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాాలా మంచిది.
Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









