)
Pitru Paksha Telugu Latest News: హిందూమతంలో పితృ పక్షాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది నవరాత్రులకు ముందు ఈ పితృపక్షాల సమయం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. ఈ సమయాల్లో చాలామంది చనిపోయిన వారి అనుగ్రహం పొందేందుకు వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి సమయంలో కాకి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తప్పకుండా తెలుసుకోవాల్సిందే. పితృపక్ష సమయాల్లో కాకి కలలో కనిపించడానికి వివిధ అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు.
కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే..
మహాలయ పక్షమి (Pitru Paksha) సమయంలో కలలో కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే అనేక శుభ సమయాలకు సంకేతమని స్వప్న శాస్త్రంలో తెలిపారు. ముఖ్యంగా ఈ సమయాల్లో కాకి రెండు రెక్కలపై ఎగురుతే.. ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీపైనే కాకి ఎగురుతున్నట్లు అనిపిస్తే చెడు సమయం పూర్తిగా ముగిసిపోయి మంచి సమయానికి వెల్కమ్ చెప్తున్నట్లు స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. అలాగే కాకి ఎగురుతున్నట్లు చూస్తే అనేక సమస్యలకు పరిష్కారమని కొంతమంది పూర్వీకులు చెబుతున్నారు.
కలలో కాకిని పట్టుకోవడం..
కలలో కాకిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే.. ఇది ఊహించని శుభసంకేతమని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలా జరిగితే జీవితంలో ఎన్నడూ ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయని.. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడే ఛాన్సులు కూడా ఉన్నాయని స్వప్న శాస్త్రంలో క్లియర్‌గా పేర్కొన్నారు. అంతేకాకుండా సంపాదనలో కూడా అనేక మార్పులు రావచ్చు.
కాకులు ఆహారం తిన్నట్లు కలలో కనిపించడం..
పితృపక్షాల సమయంలో మీ కలలు కాకి ఏదైనా ఆహారం తింటున్నట్లు కనిపించడం మంచిది కాదని స్వప్న శాస్త్రం తెలుపుతోంది. ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల కష్టాలకు దారితీస్తుందని కొంతమంది పూర్వీకులు కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఇది అశుభ సంఘటనకు సూచికగా కూడా స్వప్న శాస్త్రంలో భావిస్తారట. అలాగే చనిపోయిన పూర్వీకులు కూడా ఆహారం కోసం ఎంతో వేచి చూస్తున్నట్లు సూచికగా చెప్పుకుంటారు.
కలలో చనిపోయిన కాకి కనిపించడం..
పితృపక్షాల సమయాల్లో కలలో కాకి చనిపోయినట్లు కనిపించడం అంత శుభప్రదం కాదని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. ఇది చనిపోయిన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అనడానికి సంకేతమని పూర్వీకులు చెబుతున్నారు. అంతేకాకుండా అనేక నష్టాలకు దారి తీయవచ్చు అని వారు అంటున్నారు. అలాగే శని దేవుడు మీపై కోపంగా ఉన్నాడన్నడానికి కూడా కారణమని స్వప్న శాస్త్రంలో తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి