)
Kaal Bhairav Jayanti Date 2025 Tradition and pooja vidhan: కార్తీక మాసంను అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసం అంతట కూడా ఏదో ఒక పండగ, పూజలు, వ్రతాలు ఉంటాయి. అదే విధంగా ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు వెయ్యిరెట్లు అధిక ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. అదే విధంగా ప్రస్తుతం మనం నవంబర్ 12న కాలభైరవ జయంతిని జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా కార్తీక మాసం అష్టమి రోజున కాలభైరవాష్టమిని జరుపుకుంటాం.
కాల భైరవుడు ఎవరు?
పురాణాల ప్రకారం, భైరవుడు శివుని కోపానికి ప్రతిరూపం. ఒక పురాణం ప్రకారం, శివుడు సతీమణి సతీదేవీ తనతండ్రి దక్షయజ్ఞం చేస్తున్నాడని పిలవకుండానే వెళ్తుంది. అప్పుడు దక్షరాజు సతీదేవీని ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమాన భారంత సతీదేవీ ఆత్మార్పణం చేసుకుంటుంది. అప్పుడు శివుడు రౌద్రరూపంలో అక్కడకు వచ్చి.. కోపంతో శివతాండవం చేసి తన తలవెంట్రుకను ఒకదాన్ని భూమి మీదకు విసురుతాడు.
అది కాస్త కాలభైరవుడిలా ఉద్భవిస్తుంది. ఆయన ఉగ్రస్వరూపంగా వెళ్లి దక్షరాజు శిరచ్ఛేదం చేస్తాడు. ఆతర్వాత శివుడు శాంతిస్తాడు. దక్ష రాజుకు మేకతలను ధరింపచేస్తాడు. తన తప్పును తెలుసుకున్నందుకు దక్షరాజును శివుడు అనుగ్రహిస్తాడు. ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. అప్పటి నుంచి కార్తీక మాసంలో అష్టమి రోజున కాలభైరవాష్టమిని జరుపుకుంటారు.
పూజా విధానం..
ఈ రోజున చాలా మంది కాలభైరవుడ్ని ఆరాధిస్తారు. ముఖ్యంగా కాలభైరవుడ్ని మద్యంతో పూజలు చేస్తారు. ఇప్పటికే కాశీలో కాలభైరవస్వామికి మద్యంను అర్పిస్తారు. అంతేకాకుండా.. చాలా మంది శునకాలకు ఈరోజున చపాతీలు, పాలు పెడుతుంటారు. కాలభైరవుడ్ని అనుగ్రహం కోసం శివుడికి అభిషేకం చేస్తారు.
ముఖ్యంగా శత్రుబాధలు ఉన్నవారు కాలభైరవ జయంతి రోజున శివుడికిఅభిషేకంతో పాటు, ఉపవాసం, కుక్కలకు చపాతీలు పెడితే శకునిలాంటి పన్నాగాలు పన్నే వారి కుయుక్తులు కూడా వారి మెడకే చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాదిన రాష్ట్రాల ప్రజలు కాలభైరవ జయంతిని ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈ రోజున పేదలకు అన్నదానాలు, వస్త్రాలు దానంగా ఇస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook