)
Kanya Rashi 2026 To 2027 Telugu News: 2026 ఆంగ్ల సంవత్సరం అతి త్వరలోనే ప్రారంభం కాబోతోంది. దీనికి ముందే చాలామంది వారి రాశి ఫలాలను తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్ర నిపుణులను ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది ఆన్లైన్ ద్వారా తెలుసుకుంటున్నారు. నిజానికి చాలామంది వారి రాశి ఫలాల గురించి ఎంతగానో గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా 2026 సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు నక్షత్ర సంచారం తో పాటు రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా కన్య రాశి వారికి చాలా శుభ్రంగా ఉండబోతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. వీరికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పట్టుదలతో చేసే ప్రతి పని అద్భుతమైన విజయాలను అందించబోతుందని వారు చెబుతున్నారు. అయితే, కన్య రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉద్యోగాలు రాజకీయ రంగాలు:
ముఖ్యంగా కన్య రాశి వారికి ఉద్యోగాలపరంగా ఈ ఏడాది మొత్తం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కన్యా రాశి వారు తప్పకుండా ఈ సమయంలో ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆలస్యంతో కూడిన ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. అయితే ఉద్యోగాలపరంగా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ అంకితభావంతో పనులు చేయడం వల్ల తప్పకుండా విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో పాటు పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు ఈ ఏడాది చాలా కీలకంగా కాబోతోంది.
వ్యాపారాలతో పాటు కళారంగాలు:
2026 సంవత్సరం కన్యా రాశి వారికి వ్యాపారాల పరంగా మేలు జరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో ఆశించిన స్థాయిలో లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఐరన్ తో పాటు సిమెంట్, బంగారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని మాచిరాజు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళా రంగంతో పాటు టీవీ లేదా సినిమా రంగంలో పనులు చేస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు రావడమే కాకుండా ఈ సమయాల్లో అవార్డులు కూడా దక్కించుకోగలుగుతారు. అంతేకాకుండా ఎంతో కళాత్మకంగా పనిచేసే పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు.
విద్యార్థులకు రైతులకు:
విద్యార్థులు ఈ సమయంలో అందరికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఏకాగ్రతతో పాటు జ్ఞాన శక్తి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి పోటీ పరీక్షలు రాసిన అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ర్యాంకులు సాధించడమే కాకుండా సమాజంలో తమదైన శైలిలో ముద్ర వేసుకుంటారు. రైతులకు కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా మొదటి పంట ఎక్కువ లాభాలతో చేతికి వస్తుంది. దీని కారణంగా వేరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక కోళ్ల ఫారాలు నడిపే వ్యక్తులకు ఈ ఏడాది లాభదాయకంగా ఉండబోతోంది.
మహిళలకు ఎలా ఉంటుంది?
కన్యరాశి మహిళలకు కుటుంబంలో శాంతి విపరీతంగా పెరగబోతుంది.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ సమయంలో అన్యోన్యత విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విలువైన ఆస్తుల విషయాల్లో ఈ సమయాల్లో తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు కూడా పాటించబోతున్నారు. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఏడాది మంచి పండంటి బిడ్డ జన్మిస్తాడు. అలాగే ద్వితీయార్థంలో కూడా అద్భుతమైన స్త్రీ సంతానయోగం కనిపిస్తోంది. కాబట్టి ఈ ఏడా ది మహిళలకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి తప్పకుండా మంగళవారం లేదా గురువారాల్లో ఉపవాసాలు ఉండడం మంచిది. అంతేకాకుండా ప్రతిరోజు ఓం శంశనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook