Latest King Cobra Video: తాతా నువ్వు తోపు.. ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రాతో సాహసం.. అరుదైన వీడియో మీ కోసమే!

Latest King Cobra Video Watch Here: ఓ 60 ఏళ్ల స్నేక్‌ క్యాచర్‌ పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలను చూసి నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియో మీరు కూడా చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 17, 2025, 07:59 AM IST
Latest King Cobra Video: తాతా నువ్వు తోపు.. ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రాతో సాహసం.. అరుదైన వీడియో మీ కోసమే!

Latest ​ King Cobra Video Watch Here Now: స్నేక్ క్యాచర్ల పని చాలా ప్రమాదకరమైదని తెలిసినప్పటికీ చాలా మంది వృత్తి ధర్మం కోసం పాములు పట్టుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది పాముల కాటు బారిన పడి మరణిస్తున్నారు. చాలా మంది స్నేక్‌ క్యాచర్స్‌ తమ కుటుంబాల నుంచి ఈ నైపుణ్యాన్ని వారసత్వంగా పొందుతారు. మరికొంతమందైతే.. ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని, ఈ వృత్తిని నేర్చుకుంటున్నారు. చాలా మంది స్నేక్‌ క్యాచర్స్‌ పాములను పట్టుకోవడమే కాకుండా వారు ప్రజలకు పాముల గురించి అవగాహన కల్పించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

Add Zee News as a Preferred Source

మరికొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి వారి కష్టాన్ని సోషల్ మీడియా వినియోగదారులతో పంచుకుంటున్నారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే..అయితే తరచుగా ఆడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో పాములు, జంతువులు సంచారం చేయడం సర్వసాధారణం.. ఇలా అనుకోకుండా ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సంచారం చేసిన పాములను రక్షించుకునేందుకు పాములు పట్టేవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా మంచి స్నేక్‌ క్యాచర్స్‌ కొన్ని చోట్ల పాములను పట్టుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 

తాజాగా కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ ఓ భారీ కింగ్‌ కోబ్రాను పట్టుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ స్నేక్‌ క్యాచర్స్‌ పొలాల్లో సంచారం చేస్తున్న కింగ్‌ కోబ్రా పామును పట్టుకునేందుకు ప్రయత్నించడం చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి పాము తోక భాగం పట్టుకుని పొదల నుంచి బయటి లాక్కొని తీసుకు రావడం కూడా గమనించవచ్చు. ఆ పామును బటికి తీసుకుని వచ్చి తల భాగాన్ని పట్టుకుని అందరికీ చూపించడం కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈ వైరల్‌ అవుతున్న వీడియోను @OTVNewsEnglish అనే ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ యూట్యుబ్‌ ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి ఈ వీడియోను 33 లక్షల మంది కంటే ఎక్కువే సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా  ఈ వీడియోకు "ఒడిశాలోని నయాగఢ్‌లో భారీ కింగ్ కోబ్రాను రక్షించారు" అనే క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేశారు. అయితే ఈ పెద్ద కింగ్‌ కోబ్రాను ఓ 60 ఏళ్ల స్నేక్‌ క్యాచర్‌ పట్టుకోవడం విశేషం. అయితే చాలా మంది ఈ వీడియో చూసినవారు కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News