)
Ganpati Bappa Morya Meaning: వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రులు పూజలందుకుంటున్న గణపయ్య ఆఖరి రోజు నిమజ్జనం కానున్నాడు. ఈ సందర్భంగా భక్త లోకం 'గణపతి బప్పా మోరియా' అంటూ నినదిస్తుంటారు. భక్తిపారవశ్యంలో గణనాథుడిపై ప్రేమతో గట్టిగా చిన్నాపెద్ద నినాదాలతో మార్మోగిస్తుంటారు. గణపతి బప్పా మోరియా అని అందరూ అంటుంటారు. కానీ దానర్థం ఏమిటో తెలుసా? భక్తులందరూ మోరియా అంటున్నా వారికి దానర్థం తెలియదు. అదేమిటో తెలుసుకుందాం.
అసలు కథ ఇదే..
వినాయక నవరాత్రి వేడుకల్లో సాధారణంగా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదిస్తున్నాం. మోరియాకు పెద్ద చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు మహారాష్ట్రలో ఉండేవాడంట. పుణెకు సమీపంలోని చించ్వాడి అనే గ్రామానికి చెందిన మోరియా గోసావికి గణపతి అంటే చాలా ఇష్టం. వినాయకుడిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగావ్ ప్రాంతం వరకు రోజూ కాలినడకన వెళ్లేవాడంట.
కలలో ప్రత్యక్షం
అయితే ఓ రోజు మోరియా నిద్రకు జారుకున్న సమయంలో వినాయకుడు కలలోకి వచ్చాడంట. 'సమీపంలో ఉన్న నదిలో నా విగ్రహం ఉంది. అది తీసుకువచ్చి ప్రతిష్టించు' అని మోరియా కలలో చెప్పాడంట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో అని తెలుసుకునేందుకు మోరియా గోసావి నదికి వెళ్లాడు. కలలో చెప్పినట్టుగానే నదిలో వినాయకుడి విగ్రహం లభిండంతో అతడు ఆశ్చర్యపోయాడు.
గొప్ప భక్తుడు
ఆ వినాయకుడి తీసుకునివచ్చి ప్రతిష్టించడంతో ఈ విషయం సమీప ప్రాంత ప్రజలకు తెలిసింది. మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అని అతడిని కీర్తించడం ప్రారంభించారు. మోరియా గోసావి పాదాలను తాకి 'మోరియా' అని చెప్పడం చేస్తున్నారు. 'మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే' అంటూ మొక్కడం చేస్తున్నారు. నది తెచ్చిన వినాయక విగ్రహం ప్రతిష్టించి గుడి కట్టాడు.
మీరు మోరియా అవుతారా?
మోరియా గొప్ప భక్తుడు కావడంతో నాటి స్థానికులు అతడిని ఆరాధించడం ప్రారంభించారు. అప్పటి నుంచి 'మోరియా' అని నినదించడం చేస్తున్నారు. గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో ఇప్పుడు భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. వినాయకుడికి గొప్ప భక్తుడు మోరియా గోసాని కావడంతో అతడిలా తాము భక్తులమని చెప్పేందుకు 'మోరియా' అని నినదిస్తారని సిద్ధాంతులు చెబుతుంటారు. ఎంతో భక్తితో వినాయకుడిని కొలిస్తే అందరూ మోరియా మాదిరి అవుతారని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.