)
Talaneelalu Secrets: ఇష్టదైవానికి తలనీలాల ఫలితం ఏమిటి అనే సందేహం వస్తుంటుంది. కోరిన కోరికలు తీరిస్తే మీకు తలనీలాలు లేదా గుండు చేయించుకుంటానని భక్తులు మొక్కుకుంటారు. కోరికలు నెరవేరితే మాత్రం వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొక్కుకున్న ఆలయాలకు వెళ్లి తలనీలాలు సమర్పిస్తారు. దేవుడికి వెంట్రుకలు సమర్పించడం వలన ఏం జరుగుతుంది? జుట్టుకు దేవుడికి సంబంధం ఏమిటో తెలుసా? హిందూ సంప్రదాయంలో ఉన్న తలనీలాలకు సంబంధించి రహాస్యాలు తెలుసుకుందాం.
పాపాలకు నిలయాలు
దేవుళ్లకు తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తలనీలాలు ఇచ్చే ప్రాంతాన్ని కల్యాణకట్టగా పిలుస్తారు. భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు.. వెంట్రుకలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడంతో పాపాలను తొలగిపోతాయనే విశ్వాసం అందరిలో ఉంది. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి. అందుకే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. దీనినే పుట్టు వెంట్రుకలు తీయించడం అంటారు. పాపాలను కలిగి ఉండడం వలన శిరోజాలను తీసివేస్తారు. దీనినే శిరోగతాని పాపాని అంటారు.
మహాభారతంలో కథ
భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమవగా ధర్మరాజు అతడిని నిలువరిస్తాడు. అతడిని వధించడం ధర్మసమ్మతం కాదని చెబుతాడు. అందుకని సైంధవుడి తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పని అవుతుంది అని భీముడికి ధర్మరాజు వివరిస్తాడు. ధర్మరాజు ప్రకారం భీముడు సైంధవుడికి గుండు గీస్తారు.
వేంకట అంటే..
తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు చెబుతారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో అది కల్యాణకట్టగా స్థిరపడింది. ’వేం’ అంటే పాపాలు ‘కట’ అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని ‘కలౌ వేంకటనాయక’ అని అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ వెంకటేశ్వరుడిగా గుర్తింపు పొందారు. అందుకనే ఆయన ఆలయంలో వెంట్రుకలను సమర్పస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook