Kuja Dev: కుజుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య.. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కుబేరులు అవ్వాల్సిందే..

Kuja Dev Lucky Number: కుజుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ 9.. కాబట్టి సంఖ్యా శాస్త్రం పరంగా ఈ సంఖ్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు ఊహించని అదృష్టాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు కొన్ని విషయాలపై జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 8, 2025, 10:10 PM IST
Kuja Dev: కుజుడికి ఎంతో ఇష్టమైన సంఖ్య.. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కుబేరులు అవ్వాల్సిందే..

Kuja Dev Lucky Number: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని కీలకమైన గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాల్లో ఆ కీలకమైన గ్రహాలే రాశులపై ప్రభావం చూపుతాయి. ఇందవీరుఅత్యంత ముఖ్యమైన గ్రహమే కుజుడు. కుజుడు సంఖ్యా శాస్త్రం పరంగా తొమ్మిదవ సంఖ్యగా చెప్పుకుంటారు. అలాగే 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య కూడా 9గా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో.. సంఖ్యాశాస్త్రంలో సంఖ్యలకు అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంఖ్యకి ఒక్కొక్క గ్రహంతో ముడిపడి ఉంటుంది. ప్రతి సంఖ్యకి గ్రహం అధిపతిగా ఉంటుంది. అంతేకాకుండా సంఖ్యాశాస్త్రంలో ఈ తొమ్మిదవ నెంబర్ సంఖ్యను హనుమంతునికి సంబంధించిన దానిగా కూడా భావిస్తారు. కాబట్టి ఈ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు కొన్ని అరుదైన లక్షణాలను కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రంలో పేర్కొన్నారు. అయితే 9 వ నెంబర్ లో జన్మించిన వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఈ లక్షణాలు ఉంటాయి:
తొమ్మిదవ నెంబర్ సంఖ్యలో జన్మించిన వ్యక్తులు హనుమంతుడి అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. వీరు ఎల్లప్పుడు నిర్భయంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఎలాంటి సాహసోపేతమైన పనులైన సులభంగా చేయగలుగుతారు. వీరికి హనుమంతుడి ఆశీస్సులు లభించి ఎప్పటికప్పుడు క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి కూడా సులభంగా రక్షణ పొందుతారు.. అలాగే ధైర్యవంతులుగా కూడా వీరిని భావిస్తారు. వీరికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. సాంకేతిక రంగాల్లో వీరు అద్భుతమైన ప్రావీణ్యంతో ముందుకెళ్తారు. అలాగే వీరు పెద్దపెద్ద వ్యక్తులను కలుసుకోగలుగుతారు. జీవితంలో అనుకున్న పనులు వెంట వెంటనే సాధించేందుకు అదృష్టాన్ని కూడా పొందుతారు.

వీరికి ఉండే బలహీనతలు: 
9వ నెంబర్లు జన్మించిన వారు కాస్త మాట్లాడడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇతర వ్యక్తుల గురించి చెడుగా చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తారు. వీరికి ఉండే మొండితనం వల్ల అనేక సమస్యలను కొనితెచ్చుకుంటారు. అలాగే యవ్వనంలో చాలా కష్టంగా  ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరికి గాయాలు కూడా సులభంగా అవుతాయి కాబట్టి శస్త్రచికిత్సలు తప్పకుండా జరుగుతాయి. అంతేకాకుండా పెద్దవారితో దురుసుగా ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కుటుంబ సభ్యులతో కూడా వీరు అంతంత మాత్రమే ఉంటారు.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

ముఖ్యంగా 2025 సంవత్సరం సంఖ్యా శాస్త్రం పరంగా చూస్తే 9వ నెంబర్లో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో వీరు అద్భుతమైన పురోగతులు సాధిస్తారు. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారికి అపార ధన లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా కూడా అనేక రకాల లాభాలు కలిగే ఛాన్సులు ఉన్నాయి. అలాగే కుజుడి అనుగ్రహం వల్ల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో ముందుకు సాగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని కలిగి ఉండడం వల్ల వీరు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News