Kuja Transit 2025 Effect On Zodiac Telugu: కుజుడిని చాలా శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి మానవులపై ఏదో ఒక ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అలాగే దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడిని అన్ని గ్రహాలకు అధిపతిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం నవంబర్ 7వ తేదీన తిరోగమన స్థితి నుంచి సాధారణ స్థితికి వచ్చింది. అయితే, కుజుడు అస్తమించడం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా ఈ గ్రహం సొంత రాశిలో సంచార దశలో ఉంది. కాబట్టి కొన్ని రాశుల వారికి ఈ రోజు నుంచి ఊహించని ధన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుజుడు సొంత రాశిలో సాధారణ స్థితిలోకి రావడం వల్ల ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశుల వారికి కుజుడి అనుగ్రహం..
సింహరాశి
సింహ రాశి వారికి కుజుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ గ్రహం సాధారణ స్థితిలోకి రావడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం సానుకూలమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో శాంతి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే భయాలు కూడా తొలగిపోయి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ విజయం దిశగా వెళ్తారు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఆశలు చిగురించుతాయి. ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరిగి.. వ్యాపారాలు చాలా సక్రమంగా చేయగలుగుతారు.
మేషరాశి
మేష రాశి లో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు అస్తమించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. సీనియర్ అధికారుల సహాయంతో ఆర్థికంగా అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇక పాత స్నేహితులతో ఎన్నో రకాల డబ్బు లాభాలు కలుగుతాయి. కెరీర్ పరంగా వచ్చిన ఎన్నో అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా.. ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి ప్రభావంతో ఈ రోజు నుంచి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే పనుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కొన్ని పనుల్లో కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ వార్తను జీ న్యూస్ దృవీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









