)
Kuju Grace Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో కుజుడు బలంగా ఉంటేనే జీవితం సక్రమంగా సాగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో అద్భుతమైన ప్రయోజనాలతో పాటు కీర్తి, ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి. మరోవైపు కుజుడు జాతకంలో బలహీన స్థానంలో ఉంటే చెడు ప్రభావం కూడా తప్పదు.. ఈ గ్రహం బలహీన స్థానంలో ఉన్న రాశుల వారికి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి.. అలాగే ఎలాంటి పనులు చేసిన చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఆశించిన విజయాలు కూడా త్వరగా సాధించలేక పోతారు. ఇదిలా ఉంటే కుజుడి అనుగ్రహం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, కుజుడి అనుగ్రహం ఎల్లప్పుడూ పొందే రాశులేవో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి
మకర రాశి వారికి కుజుడి అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు, వీరికి ఎల్లప్పుడు కుజుడు ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు. దీనివల్ల వీరు ఎంతో ఓపికగా క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే వీరు శారీరకంగా మానసికంగా చాలా బలంగా ఉంటారు.. అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా చాలా వరకు అద్భుతమైన లాభాలు పొందుతారు. మకర రాశి వారు భారీ మొత్తంలో సంపాదన కూడా పొందుతారు. దీనివల్ల వీరికి సమాజంలో మంచి గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా తొందరగానే తగ్గిపోతాయి.
మేషరాశి
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి, వీరికి కూడా ఎల్లప్పుడూ కుజుడి అనుకూలమైన ప్రభావమే పడుతుంది. వీరు కుజుడి ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా వీరికి చాలావరకు కలిసి వస్తుంది అలాగే ధైర్యంతో పాటు శక్తి సామర్థ్యాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. కష్ట సమయాల్లో ఓపికగా ఉండే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు అంతేకాకుండా కెరీర్ పరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరు ఎల్లప్పుడూ భారీ మొత్తంలో డబ్బులు కూడా సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కూడా అంగారకుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు.. దీనివల్ల వీరికి జీవితంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కుజుడి అనుకూలమైన ప్రభావంతో ఊహించని సంపదను పొందగలుగుతారు. అలాగే వీరికి ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వీరు ఉత్సాహంగా ముందుకెళ్తారు.. కుజుడి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారు సులభంగా కష్టతరమైన పనులు కూడా చేయగలుగుతారు. అలాగే వీరు శత్రువులపై కూడా ఎంతో సులభంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయి. వీరికి ధైర్యం విపరీతంగా ఉంటుంది.. కాబట్టి కష్ట సమయాల్లో కూడా అద్భుతమైన ధైర్యాన్ని చూపించి ముందుకు వెళుతూ ఉంటారు. అంతేకాకుండా సంతోషం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి