Lakshmi Devi Pooja: ఈ 5 వస్తువులు మీ దగ్గర ఉంటే, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది! ఇవి ఖరీదైనవి కూడా కాదు!

Lakshmi Devi Likes: హిందూ మత విశ్వాసాల ప్రకారం.. లక్ష్మీదేవి సంపద, అదృష్టానికి దేవత. ఆమెను భక్తితో పూజించడం వల్ల ఇల్లు సంపదతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన 5 వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Harish Darla | Last Updated : Dec 6, 2025, 06:18 PM IST
Lakshmi Devi Pooja: ఈ 5 వస్తువులు మీ దగ్గర ఉంటే, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది! ఇవి ఖరీదైనవి కూడా కాదు!

Lakshmi Devi Likes: హిందూ మత విశ్వాసాల ప్రకారం.. లక్ష్మీదేవి సంపద, అదృష్టానికి దేవత. ఆమెను భక్తితో పూజించడం వల్ల ఇల్లు సంపదతో నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. శకునాల ప్రకారం.. కొన్ని పవిత్రమైన వస్తువులను కొనడం వల్ల శుక్రుడి ప్రభావం బలపడుతుందట. దీని వల్ల లక్షీదేవి ఆశీస్సులు మెండుగా ఉంటాయని అంటున్నారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన 5 వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

దక్షిణవర్తి శంఖం (కుడిచేతి శంఖం): 
పురాణాల ప్రకారం.. క్షీర సాగర మథనం సమయంలో దక్షిణవర్తి శంఖం అందులో నుంచి ఉద్భవించిందని భక్తులు నమ్ముతారు. అలాంటి అరుదైన శంఖాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుందని అంటారు. శుక్రవారం నాడు ఈ దక్షిణవర్తి శంఖాన్ని ఇంటికి తీసుకురావడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతారు. 

Also Read: Zodiac Signs: ఈ 3 రాశుల వారు తిరుమల కొండ అస్సలు ఎక్కకూడదు! ఏం జరుగుతుందో తెలుసా?

శ్రీ యంత్రం: 
శ్రీ యంత్రాన్ని లక్ష్మీదేవి దైవిక చిహ్నంగా భక్తులు భావిస్తారు. ఈ యంత్రం సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుందని వాదన. శుక్రవారం నాడు ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంట్లో సరైన ఆచారాలతో పూజించడం ద్వారా సాక్ష్యాత్తూ ఆ శ్రీమహాలక్ష్మీ ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఇంట్లో ఈశాన్య ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేయడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందట.

గవ్వలు: 
లక్ష్మీదేవికి గవ్వలు కూడా ప్రియమైనదే. ఆమెకు ఇష్టమైన శుక్రవారం రోజున కావడి కొని అమ్మవారికి సమర్పించడం శుభప్రదమట. ఇవి మీరు సంపద లేదా డబ్బు పెట్టుకునే చోట వీటిని భద్రపరిస్తే సంపద పెరుగుతుందని నమ్మకం. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయని నమ్ముతారు.

తామర పువ్వు: 
లక్ష్మీ దేవికి తామర పువ్వు చాలా ప్రియమైనది. తామరపువ్వులోనే ఆమె సింహాసనంగా మారింది. శుక్రవారం నాడు తామర పువ్వు కొని లక్ష్మీదేవికి సమర్పించి పూజించడం వల్ల ఆమె ఆశీస్సులు మెండుగా ఉంటాయట. తామరపువ్వు స్వచ్ఛత, శ్రేయస్సును చిహ్నంగానూ ఉంటుంది.

వెండి: 
శుక్రవారం నాడు వెండి ఆభరణాలు లేదా ఇతర వెండి వస్తువులను కొనడం ఎంతో అదృష్టమట. ఈ రోజున వెండి కొంటే, దానికి బొట్టు పెట్టి పూజించడం మంచిదట. చాలా మంది తమ మనీ పర్స్‌లలో వెండి నాణెంను భద్రపరుస్తుంటారు. శుక్రవారం పూట వెండిని దానం చేయకూడదట. ఎందుకంటే అది శుక్రుని ప్రభావాన్ని బలహీనపరుస్తుందట.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మత విశ్వాసాల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News