Friday Laxmi Puja: జూలై 1న లక్ష్మీదేవిని ఇలా పూజించండి.. అంతులేని సంపదను సొంతం చేసుకోండి!
Friday Laxmi Puja: సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఈ తల్లి అనుగ్రహం ఉంటే చాలు మన ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. లక్ష్మిదేవి కటాక్షం పొందాలంటే శుక్రవారం నాడు ఈ పరిహారాలు చేయండి.
Lakshmi Puja In Special Yog: తమపై లక్ష్మిదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం అమ్మవారిని పూజిస్తారు. తల్లి లక్ష్మి (Goddess Laxmi) కృప ఉంటే చాలు బికారి కూడా బిలియనీర్ అవుతాడు. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి జూలై 1 చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజున కొన్ని శభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున లక్ష్మిదేవిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
పంచాగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ తేదీ శుక్రవారం, జూలై 1న వస్తుంది. ఈ రోజున పుష్య నక్షత్రం ఏర్పడుతోంది. ఈ రాశిలోని లక్ష్మీదేవిని పూజించడం (Lakshmi Puja) వల్ల విశేష ఫలం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మిదేవిని పూజించడం వల్ల మీరు శుభఫలితాలు పొందవచ్చు. రేపు ఈ పరిహారాలు చేయడం ద్వారా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పరిహారాలు
>> ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి జూలై 1 శుక్రవారం చాలా మంచి రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం చేయండి.
>> ఉదయం మరియు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించండి.
>> ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
>> పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేయడం ద్వారా లక్ష్మిదేవి సంతోషిస్తుంది.
>> ఈ రోజున తెల్లని వస్త్రాలు మరియు తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది.
>> అదే విధంగా లక్ష్మిదేవి మంత్రాలను జపించండి. ఓం శ్రీశ్రీ లక్ష్మీభ్యో నమ, ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్.
Also Read; Dream Girl Mantra: ఈ మంత్రాన్ని నెల రోజులపాటు పఠిస్తే.. మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి అవుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి