Love Zodiac Sign 2025: హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఈ పండగను తెలుగువారి నూతన సంవత్సరంగా భావిస్తారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 30వ తేదీన వచ్చింది. ఈ పండగ కంటే ముందు రోజే మార్చి 29న శని దేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే బృహస్పతి గ్రహం కూడా శుక్రుడు రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి మార్చి 30 నుంచి కొన్ని రాశుల వారికి ప్రేమ యోగం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 31వ తేదీన శుక్రుడు మీన రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల.. గురు గ్రహంతో కలయిక జరపడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు సులభతరమవుతాయి. ఈ సమయంలో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ప్రేమ జీవితం కలిసి వస్తుంది. ఈ గ్రహ సంచారాల వల్ల ప్రేమలో పడే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మార్చి 31వ తేదీ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. శుక్రుడు వీరికి శుభ స్థానంలో ఉండడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలిగి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.. వీరు ముఖ్యంగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య అనుకోకుండా పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జూలై తరువాత ఈ రాశి వారికి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు సంతోషంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే కర్కాటక రాశి వారు ప్రేమ పెళ్లి చేసుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారికి మార్చి 31వ తేదీ నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు కూడా అతి త్వరలోనే ప్రేమలో పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రేమ జీవితం కాస్త వివాహంగా మారే ఛాన్స్ కూడా ఉందట.. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు తోటి మహిళా ఉద్యోగులతో ప్రేమలో పడతారు. అలాగే సాంప్రదాయబద్ధంగా వివాహాలు కూడా చేసుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ప్రేమ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా సజావుగా సాగుతుంది. కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకోవడం చాలా మంచిదని వారంటున్నారు.
కన్యారాశి
ప్రేమతో పాటు వివాహానికి కారకుడైన శుక్రుడు కన్యా రాశి వారికి ఈ సమయంలో ఎంతో మేలు చేయబోతున్నాడు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ప్రేమ జీవితం పరంగా శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటినుంచో ఒంటరిగా ఉంటున్న వారికి ప్రేమ అనుకూలించి మంచి భాగస్వామి లభిస్తుంది. మార్చి 31వ తేదీ నుంచి వీరికి అనుకున్నది. అనుకున్నట్టు జరిగి ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా జీవితం పరంగా కూడా భాగస్వామి సహకారం లభించి.. వివాహానికి దారితీస్తుంది. వీరు తల్లిదండ్రుల అనుమతితో సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరుపుకుంటారు. అంతేకాకుండా వీరి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం పెరుగుతూనే ఉంటుంది.
తులారాశి
తులా రాశి వారికి శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహం బృహస్పతి తో కలిసి సంచారం చేయడం వల్ల తులా రాశి వారి ప్రేమ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి వైవాహిక జీవితం పట్ల ఆనందం కూడా పెరుగుతుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి జీవితం చాలా సజావుగా సాగుతుంది. అలాగే ఒంటరిగా ఉన్న వ్యక్తులకు మంచి భాగస్వామితో పరిచయం ఏర్పడుతుంది అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అలాగే వైవాహిక జీవితం పట్ల మక్కువ కూడా వీరికి పెరుగుతుంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కూడా శుక్ర, బృహస్పతి గ్రహం ప్రభావం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ప్రేమ జీవితం పట్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది.. నవంబర్ తర్వాత వీరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.. మొదట్లో ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ తర్వాత ఈ చిక్కుల నుంచి కాస్త విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల సహకారంతో ప్రేమ జీవితం చేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









