Ketu Favorite Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు గ్రహం అశుభగ్రహమైనప్పటికీ.. ఈ గ్రహ సంచారం కారణంగా చాలా మేలు జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మికత, విలాసవంతమైన జీవితానికి చిహ్నంగా కూడా ఈ గ్రహాన్ని పరిగణిస్తారు. అందుకే జాతకంలో కేతువు గ్రహం శుభస్థానంలో ఉంటే దీనికి లోటు ఉండదు. ముఖ్యంగా కొంతమంది కేతువు గ్రహం ప్రభావంతో కోటీశ్వరులైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం జన్మస్థానంలో ఉండే స్థానాలను బట్టి కూడా మనిషి జీవితాన్ని ఎలా ఉంటుందనేది చెప్పవచ్చు. అంతేకాకుండా కేతువు అనుగ్రహం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశుల వారు ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అదృష్టాన్ని పొందుతారు. కేతువు గ్రహ ప్రభావంతో జీవితంలో విశేషమైన ప్రయోజనాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
కన్యారాశి
కేతువు అనుగ్రహం కన్యా రాశి వారికి ఎల్లప్పుడూ లభిస్తుంది. వీరు అన్ని రంగాల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అంతే కాకుండా కుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తిని ఆధ్యాత్మికతవైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం ఎప్పుడు ఎదురైనా అతి త్వరలోనే, దాని నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా పేదరికాన్ని కూడా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా జీవితంలో వీరికి సంతోషం కూడా ఊహించని స్థాయిలో పొందగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలైనా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కష్టపడి పని చేసే వ్యక్తులకు ప్రతిఫలం లభిస్తుంది.
వృశ్చిక రాశి
కేతువు అనుగ్రహం వల్ల జీవితంలో ఎల్లప్పుడూ విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వీరికి ఏకాగ్రత కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎలాంటి పనులు చేసిన విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా పనిచేసే సామర్ధ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలాంటి పరిస్థితులైన వీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మబ్బు చూపుతారు. వీరి ఆలోచన శక్తి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరు పరిశోధన రంగాల్లో కూడా రాణించగలుగుతారు.
మేషరాశి
మేష రాశి వారు కూడా కేతువు అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఉత్సాహపరితంగా ఉంటారు. అంతేకాకుండా వీరికి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.. కాబట్టి ఎలాంటి పనులు చేసిన ఒక లీడర్గా ఎదుగుతారు.. దీంతో పాటు కేతువు ప్రభావంతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇక ఏ చిన్న రంగాల్లో పనులు చేసిన వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. దీంతోపాటు అనుకున్న స్థాయికి కూడా ఎదుగుతారు. అలాగే వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా కూడా చాలా బాగుంటారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









