Lucky Moles: జ్యోతిష్య శాస్త్రంలో వ్యక్తి జీవితంలో అనేక అంశాలపై క్లుప్తంగా వివరించారు. గ్రహాలు వాటి సంచారాలు, వాటి వల్ల మనుషులు దేశాలపై పడే ప్రభావాలు అన్ని విషయాలు క్లుప్తంగా పేర్కొన్నారు. అదే కాకుండా పుట్టుమచ్చలకు సంబంధించిన సంఖ్యల వివరాలు, ప్రీ డిక్షన్ గురించి కూడా ఎంతో వివరంగా జ్యోతిష్య శాస్త్రంలో వెల్లడించారు శరీరంపై ఉండే పుట్టుమచ్చలు మనిషి జీవితాలపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి.. అవి ఉండే రంగులతో పాటు పరిమాణాలను బట్టి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అందుకే మనిషి వ్యక్తిగత జీవితంలో పుట్టుమచ్చలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. కొంతమంది శరీరంపై కొన్నిచోట్ల పుట్టుమచ్చలను కలిగి ఉంటారు. అయితే ఏయే చోట్ల పుట్టుమచ్చలు ఉండడం మంచిదో వీటివల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే బోలెడు లాభాలు..
శాస్త్రంలో వెల్లడించిన వివరాల ప్రకారం నుదుటిపై కుడివైపున పుట్టుమచ్చ ఉండడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా ఉన్నవారికి జీవితంలో సంపాదన గౌరవం ప్రాముఖ్యతకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే అది కెరీర్ పరంగా ఆర్థిక సమస్యలను అడ్డంకులను సూచిస్తుందని ఒక నమ్మకం. కుడి కన్ను బొమ్మపై పుట్టుమచ్చ ఉంటే ఉజ్వల భవిష్యత్తుతో పాటు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారని శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వృత్తిపరమైన జీవితాల పట్ల కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. ఎలాంటి పనులు చేసిన అడ్డంకులు తొలగిపోతాయి..
కంటి దగ్గర పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుంది..
కంటి దగ్గర పుట్టుమచ్చ కూడా కెరీర్ జీవితాన్ని సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా కుడి కంటి దగ్గర పుట్టుమచ్చ ఉంటే అది సంపద ఆనందానికి సూచికగా భావిస్తారని వారంటున్నారు.. అదే ఎడమ వైపు ఉంటే ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుందని వారు చెబుతున్నారు. ఇక ముక్కు కొన పై పుట్టుమచ్చ ఉంటే సామాజిక జీవితం అస్తవ్యస్తంగా ఉండవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. పెదవిపై ఉన్న పుట్టుమచ్చ కూడా ప్రేమ దయకు సూచికగా చెప్పుకుంటారు. అయితే కింది పెదాయిపై పుట్టుమచ్చ ఉంటే సృజనాత్మకతను సూచిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కళ పట్టును కూడా పెంచుతుందని వారు అంటున్నారు.
ఎడమ చెవిపై ఉంటే ఏం జరుగుతుంది?
బుగ్గలపై పుట్టుమచ్చలు ఉంటే చాలా అదృష్టమని జ్యోతిష్య శాస్త్రంలో తెలిపారు. ఇది గౌరవంతో పాటు సమాజంలో స్థిరమైన జీవితాన్ని సూచిస్తుందని వారు అంటున్నారు అదే కుడిచెవిపై నల్లని పుట్టుమచ్చ ఉంటే భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయట.. కానీ ఇదే పుట్టుమచ్చ ఎడమ చెవిపై ఉంటే అనేక కష్టాలు వస్తాయని వారు తెలుపుతున్నారు. అలాగే మెడ కుడి భాగంలో పుట్టుమచ్చలు ఉండడం వల్ల కూడా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు నన్ను తెలుపుతున్నారు. ఇవే ఎడమవైపు ఉంటే అనేక సమస్యలకు దారి తీయవచ్చు. ఛాతిలో కుడివైపు పుట్టుమచ్చలు ఉండడం కూడా చాలా శుభప్రదమని వారంటున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









