Lucky Rasi Phalalu: శని, బృహస్పతి గ్రహ సంచారాల ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి ఊహించని లక్కు.. డబ్బుకు లోటు ఉండదు!

April 2025 Lucky Rasi Phalalu: శని, బృహస్పతి గ్రహ సంచారాల కారణంగా ఏప్రిల్ నెలలో కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 27, 2025, 05:23 PM IST
Lucky Rasi Phalalu: శని, బృహస్పతి గ్రహ సంచారాల ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి ఊహించని లక్కు.. డబ్బుకు లోటు ఉండదు!

April 2025 Lucky Rasi Phalalu: అతి త్వరలోనే ఈ ఏడాదిలోని నాలుగవ నెల ప్రారంభం కాబోతోంది. మార్చి చివరి వారం నుంచి వచ్చే నెలలోని మొదటి వారం వరకు కొన్ని గ్రహాలు రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెల చివరన శక్తివంతమైన గ్రహాలు కూడా సంచారం చేస్తాయి. మార్చి 29న శని గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అలాగే ఈ రోజే మొదటి సూర్యగ్రహణం కూడా సంభవించబోతోంది. దీని ప్రభావం ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఏప్రిల్‌ నెలలో గ్రహ సంచారాలు:
ఏప్రిల్‌ 28న శని గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది.  అలాగే ఇదే సమయంలో కూడా గురు గ్రహం మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీంతో పాటు కొన్ని ప్రధాన గ్రహాలు కూడా రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయనున్నాయి. దీని ప్రభావం 12 రాశులవారిపై పడుతుంది. అలాగే ఈ సమయంలో యాదృచ్చికం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి:
శని, బృహస్పతి గ్రహాలు నక్షత్ర సంచారం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా మేష రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌ పరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో పాటు ఇప్పటికే కోర్టు సంబంధిత సమస్యలతో భూములు కూడా తిరిగి పొందుతారు. శని ఎఫెక్ట్‌తో అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇతరులకు కూడా సులభంగా సహాయం చేస్తారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా భారీ మొతంలో జీతాలు కూడా పెరుగుతాయి. 

కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్‌ నెలలో శని, బృహస్పతి సంచారం వల్ల కర్కాటక రాశివారికి జీవితం పరంగా అనేక మార్పులు వస్తాయి. వైవాహిక జీవితం పరంగా కూడా ప్రేమ పెరుగుతుంది. దీంతో పాటు చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి కూడా సపోర్ట్‌ లభించి.. ఆర్థిక విషయాల్లో కూడా బోలెడు ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు కుటుంబంలో వివాహాలు కూడా జరుగుతాయి. ఇప్పటికే ప్రేమ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నవారికి పరిష్కారం లభిస్తుంది. ఈ సమమంలో ఇష్టమైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేసే ఛాన్స్‌ ఉంది. 

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి బృహస్పతి, శని ప్రభావం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో డబ్బులు కూడా సంపాదిస్తారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. చట్టపరమైన విషయాల్లో కూడా వీరు విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News