Lucky Zodiac Signs 2025: ఏప్రిల్ మొదటి వారం లక్కీ రాశులు.. వీరికి దిమ్మతిరిగే ప్రయోజనాలు..

April First Week Lucky Zodiac Signs 2025: ఏప్రిల్ మొదటి వారం  జరగబోయే గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని గ్రహం ఎఫెక్ట్‌తో కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆ విశేషమైన ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 30, 2025, 10:58 AM IST
Lucky Zodiac Signs 2025: ఏప్రిల్ మొదటి వారం లక్కీ రాశులు.. వీరికి దిమ్మతిరిగే ప్రయోజనాలు..

April First Week Lucky Zodiac Signs 2025: ఏప్రిల్ మొదటి నెల ఆశుభమైన యోగాలు ఏర్పడిపోతున్నాయి. ముఖ్యంగా ఒకే రాశులు ఏడు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయంలో దురుద్ర యోగం ఏర్పడుతుంది. కాబట్టి వారంలో కొన్ని రాశుల వారికి కీడు జరిగితే మరికొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని గ్రహ సంచారం, బృహస్పతి ఎఫెక్ట్ వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు. 

Add Zee News as a Preferred Source

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహ ప్రభావంతో పాటు బృహస్పతి సంచారం వల్ల సింహరాశితో పాటు మరికొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. దీనివల్ల కుటుంబ జీవితంలో సంతోషం పొందడమే కాకుండా వృత్తిపరమైన జీవితంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా గతంలో ఎప్పుడూ పొందలేనని లాభాలు కూడా పొందుతారు.

సింహ రాశి:
ఈవారం అత్యంత లాభాలు పొందబోయే రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశిలో జన్మించిన వారు అనుకున్న పనులు సకాలంలో చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో కోరుకున్న చోటికి బదిలీలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ పరంగా కూడా సమస్యలు తొలగిపోతాయి. 

మేషరాశి:

ఏప్రిల్ మొదటి వారం మేషరాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఇతరుల మాటలతో కాస్త సహకారం లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా విదేశాల్లో పనిలు చేసే వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. పిల్లలనుంచి కూడా అద్భుతమైన శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అసంపూర్ణంగా ఉన్న అన్ని రకాల పనులు పూర్తవుతాయి. అలాగే విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కాస్త ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించడం మేలు. వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది..

తులారాశి :
తులా రాశి వారికి కూడా ఈ సమయంలో స్నేహితుల నుంచి సహకారం లభించి, వ్యాపారాల పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఏప్రిల్ మొదటి వారం కెరీర్ పరంగా కూడా చాలావరకు అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే  కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సపోర్టుతో ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News