
September Lucky Horoscopes Telugu: సెప్టెంబర్ నెలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నెలలో ఎంతో శక్తివంతమైన సూర్యుడితో పాటు కుజుడు బుధ శుక్ర గ్రహాలు సంచారం చేస్తాయి. దీంతో కొన్ని రాశుల వారిపై శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో మొదటగా 13వ తేదీన కుజుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 15వ తేదీన సింహరాశిలోకి శుక్రుడు వెళ్తాడు. ఇక 17వ తేదీన కన్యా రాశిలోకి సూర్యుడు సంచారం చేస్తాడు. ఆ తర్వాత ఇతర గ్రహాలు రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేస్తాయి.. బుధుడు సూర్యుడుతో కలయిక జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ నెల నుంచి కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు రాశి
ముఖ్యంగా ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా వైవాహిక జీవితం తో పాటు ప్రేమ జీవితంలో విశేషమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇక కొత్త వ్యక్తులతో ఈ సమయంలో సంబంధాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా వీరు సామాజిక రంగంలో చాలా చురుకుగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరు కొన్ని రకాల శుభవార్తలు కూడా వినయ్ అవకాశాలు ఉన్నాయి..
వృషభ రాశి
సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం కారణంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఈ సమయంలో ఊహించని ఫలితాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో సానుకూలమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. వీటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి సెప్టెంబర్ నెలలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అలాగే వ్యాపారవేత్తలు కోరుకున్న కాంట్రాక్టులు కూడా పొందుతారు. దీంతోపాటు ఈ సమయంలో ఆర్థికంగా కూడా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఇక జీవితంలో ఎప్పుడూ లభించని ప్రశంసలు కూడా ఈ సమయంలో లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కాంట్రాక్టర్లు ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు ఈ నెలలో కాస్త పరిష్కారం లభించబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి