Lunar Eclipse 2025: చంద్ర గ్రహణంలో ఈ 3 రాశులకు మహర్దశ, కనకవర్షం

Lunar Eclipse 2025: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక, గ్రహణాలకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. ఇదంతా వివిధ రాశులపై పడుతుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మార్చ్ 14న సంభవించనుంది. దీని ప్రభావం వివిధ రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2025, 03:03 PM IST
Lunar Eclipse 2025: చంద్ర గ్రహణంలో ఈ 3 రాశులకు మహర్దశ, కనకవర్షం

Lunar Eclipse 2025: చంద్ర గ్రహణానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. చంద్ర గ్రహణం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఈ ఏడాదిలో మొట్టమొదటి చంద్ర గ్రహణం మార్చ్ 14వ తేదీన హోలీ రోజున ఉంది. దాంతో మూడు రాశులకు మహర్దశ పట్టనుంది. మార్చ్ 14 నుంచి ఈ మూడు రాశుల వ్యక్తులు కోటీశ్వరులుగా మారనున్నారు. 

Add Zee News as a Preferred Source

ఈ ఏడాది మొదటి చంద్ర గ్రహణం మార్చ్ 14 న సంభవిస్తుంది. సరిగ్గా అదే రోజు హిందూవుల హోలీ పండుగ ఉంది. ఈసారి చంద్ర గ్రహణం కన్యారాశిలో సంభవించనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదే సమయంలో కేతువు కూడా ఇదే రాశిలో ఉంటాడు. ఇదే రోజున సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం, చంద్రుడు మీనం నుంచి కన్యా రాశిలో రావడం జరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం వివిధ రాశుల్లో జరిగే పరిణామాలు జాతకాలను మార్చనున్నాయి. చంద్ర గ్రహణం ఏర్పడే సమయంలో శని గ్రహం కుంభ రాశిలో ఉండటం వంటి మార్పులు కన్పిస్తాయి. అందుకే కొన్ని రాశులకు అమితమైన లాభాలు కలగనున్నాయి. ముఖ్యంగా మేషం, మిధునం, కర్కాటక రాశులకు విశేష ప్రయోజనం కలగనుంది. 

మిధున రాశి జాతకులకు ఈ సమయంలో మహర్దశ పట్టనుంది. శని గ్రహంతో ఏర్పడే శశ రాజ్యయోగం కారణంగా ఈ రాశి జాతకులకు దశ మారనుంది. ఊహించని ధన సంపద వచ్చి పడుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఉద్యోగులకు పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారులకు అనువైన సమయం. అమితమైన లాభాలు ఆర్జిస్తారు. 

కర్కాటక రాశి జాతకులకు అద్భుతమైన సమయం ఇది. చంద్ర గ్రహణం ప్రభావంతో అమితమైన ధనం లభిస్తుంది. పెట్టుబడులకు అత్యంత అనువైన సమయం. వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు, పదోన్నతి లభిస్తాయి. ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే కోటీశ్వరులు కాగలరు. 

ఇక మేష రాశి జాతకులకు ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. అమితమైన ఆర్ధిక లాభాలు పొందుతారు. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలంటే మంచి సమయం. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతితో పాటు జీతాలు పెరుగుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. 

Also read: Champions Trophy 2025 Ind vs Nz: 25 ఏళ్ల పగకు టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News