Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇవాళే ఆఖరి రోజు. 45 రోజుల మహా పర్వం ఇవాళ్టితో ముగుస్తోంది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా..మహా శివరాత్రితో పూర్తి కానుంది. ఇవాళ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.
జనవరి 13న మహా కుంభమేళా అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దాదాపు 45 రోజులుగా జరుగుతున్న మహా పర్వం ఇవాళ మహా శివరాత్రి స్నానాలతో ముగుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద థార్మిక ఉత్సవంగా మహా కుంభమేళా రికార్డు సాధించింది. ఇప్పటి వరకు 63.36 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక గుడారాలు, టాయిలెట్లు అమర్చింది. ఎప్పటికప్పుడు స్నానం చేసే పరిసర ప్రాంతాల్ని శుభ్రం చేసేందుకు వందలాదిగా పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించింది. తప్పిపోయినవారి సమాచారం కోసం 24 గంటల సేవా కేంద్రాలు ఎక్కడికక్కడ ఏర్పాటయ్యాయి.
ఇవాళ చివరి రోజు మహా శివరాత్రి కావడంతో త్రివేణి సంగమ క్షేత్రం కిటకిటలాడనుంది. ఇసుకేస్తే రాలనంత జన ప్రవాహం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో ఇవాళ చివరి పుణ్య స్నానం అదృష్టం కోసం భక్తులు పోటీ పడనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రయాగ్ రాజ్ చేరుకోనున్నారు. చివరి రోజు భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
వాస్తవానికి కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఓసారి జరుగుతుంది. అయితే ఈసారి కుంభమేళా 144 ఏళ్లకు వచ్చే అరుదైంది కావడంతో పెద్దఎత్తున ప్రచారం లభించింది. దాంతో భారీగా జనం పోటెత్తారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లో రోజుల తరబడి ప్రయాణీకులు చిక్కుకున్నారు. మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. డిల్లీ రైల్వే స్టేషన్‌లో భక్తుల తొక్కిసలాటలో మరో 18 మంది మరణించారు. అన్నింటినీ దాటుకుని మహా కుంభమేళా చివరి ఘట్టానికి చేరుకుంది. ఇవాళ మహా శివరాత్రితో ముగియనుంది.
Also read: Delhi CAG Report: ఆప్‌ను వెంటాడుతున్న మద్యం పాలసీ, 2 వేల కోట్ల నష్టం>
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









