Maha shivaratri abhishekam: మహా శివరాత్రి అనేది పెద్ద పండగ. ఈ రోజు ప్రతి ఒక్క శివాలయం కూడా అందంగా దీపాలతో అలంకరిస్తారు. ఈ సారి శివరాత్రి మాఘమాసం కృష్ణ పక్షం చతుర్దశి రోజున ఫిబ్రవరి 26న వస్తుంది. శివరాత్రిని ముఖ్యంగా లింగోధ్బవ కాలంలో ఎక్కువగా పూజించుకుంటారు. అయితే.. ఈ సారి ఫిబ్రవరి 26న అర్ధరాత్రి లింగోధ్బవం సమయంను రాత్రి 12 గంటలకు పండితులు చెబుతున్నారు.
ఆ సమయంలో శివుడ్ని పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనెలతో అభిషేకం చేయాలని పండితులు సూచిస్తున్నారు. అదే విధంగా మహా శివరాత్రి రోజున తప్పుకుండా మూడు పనుల్ని మర్చిపోకుండా ఆచరించాలని పురోహితులు తరచుగా చెబుతుంటారు. అవేంటంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి 26న బ్రహ్మమూహూర్తంలో నిద్రలేవాలి. ఆరోజున శుభ్రంగా తలస్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకొవాలి. అంతే కాకుండా.. ట్రెడిషనల్ గా పంచ కట్టుకుని ఆలయంకు వెళ్లాలి. శివలింగం ఉన్న ఆలయంకు వెళ్తే మంచిది. ముఖ్యంగాపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనెలను తమతో తప్పకుండా తీసుకొని వెళ్లాలి. అదే విధంగా బిల్వపత్రాలను కూడా తీసుకెళ్లాలి.
శివుడికి పండితుడితో రుద్రం చెప్పించుకుని అభిషేకం చేయాలి. అంతే కాకుండా..బిల్వపత్రంను తప్పనిసరిగా శివుడికి అర్పించాలి. ఆ తర్వాత గంధం పెట్టి తెల్లజిల్లేడు పువ్వులతో పూజలు చేయాలి. శివుడికి ఖర్జురాలు, కొబ్బరి కాయ, చక్కెర మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి.
Read more: Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ భారీ శుభవార్త.. ఆ టికెట్లు ఇక నుంచి డబుల్.. డిటెయిల్స్..
ఆ రోజున ఉపవాసం ఉంటే.. ఎంతో పుణ్యం వస్తుందని పండితులు చెబుతుంటారు. అదే విధంగా రాత్రి పూట జాగరణ చేస్తే వారికి కల్గే పుణ్యం వల్ల ధనానికి అస్సలు కొదువ ఉండదని పండితులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









