Maha Shivratri 2025: శివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడని పేరు. కోరిందే తడవుగా వరాలను ప్రసాదించే దైవం ఆ పరమ శివుడు. అందుకే ఆయనను భోళాశంకరుడు అయ్యారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడు. నిరాడంబరుడైన పరమశివుని తత్త్వం మాత్రం మాహాద్భుతం. బ్రహ్మదేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారకుడని పేరు. ఈ లయకారుడి మహాలింగోద్భవం జరిగిన రోజే శివరాత్రి. ప్రతి యేటా మాఘ బహుళ చతుర్థుతి రోజున శివరాత్రి జరుపుకోవడం హిందువుల సనాతన సంప్రదాయం. శివయ్యకు మాత్రం ఈ రాత్రి మహారాత్రి.. ఈ రాత్రి ఆయన కోసమే.. అందుకే ఈ రాత్రిని మహా శివరాత్రి అంటారు.
- త్రిదళంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ.. మధ్యలో శివుడు కొలువై వుంటారని పురాణ ప్రతీతి.
- మహాలక్ష్మీ నిలయాయ అని కూడా పేర్కొనబడినబడటం వల్ల, బిల్వపత్రం సమర్పించేటపుడు గంధం రాసి సమర్పించిన శీఘ్ర అనుగ్రహం లభిస్తుందనేది ప్రతీతి.
- బిల్వపత్రములను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు.
- మారేడు దళానికి ముందుబాగంలో అమృతం, వెనుకబాగంలో యక్షులు వుంటారని పురాణ ప్రతీతి. కనుకనే బిల్వపత్రం ముందుబాగం శివలింగంపై వుండేలా సమర్పించాలి.
బిల్వ దళాలను శుద్ద జలంతో కడుగుతూ పది రోజులు వాడుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. సోమవారం కానీ.. ప్రత్యేక రోజుల్లో మాత్రం ముందు రోజు చెట్టు నుండి సేకరించిని వాటితో శివుడిని అర్చించాలి.
ఇలా వ్రాసే విధానాన్ని బట్టి ఫలితాలు కూడా వుంటాయి.
చూపుడు+బ్రొటనవేలుతో వ్రాసిన మోక్షం లభిస్తుంది...మధ్యవేలు + బ్రొటనవేలుతో రాసిన కోరిన కోరికలు తీరుతాయి..
ఉంగరంవేలు+బ్రొటనవేలితో రాసిన ధనప్రాప్తి లభిస్తుంది.. చిటికెనవేలు (అనామిక)+బ్రొటనవేలు (అంగుష్ఠం)తో రాసిన ధర్మమార్గంలో కోరికలు నెరవేరుతాయని రుద్ర శాసనంలో ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
బిల్వపత్రం కోయునపుడు ప్రార్ధించవలసిన స్తోత్రం
నమోస్తు బిల్వతరయే శ్రీ ఫలోదయ హేతవే౹
చతుర్వర్గప్రదాత్రేచ నమోమూర్తి త్రయాత్మనే౹౹
సంసార విషవైద్యస్య సాంబస్య పరమేశితుః౹
అర్చాయైత్వాం పరిష్యామి త్వత్పత్రం సహ్యతామిదమ్౹౹
లక్ష్మీదేవి ప్రీతి పాత్రమైన, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపీ, శివునకు సమర్పించడం కోసమే కోయుచున్నాను అని బిల్వ పత్రాలను కోయాలి.
బిల్వపత్రాలలో రకాలు..
అఖండ బిల్వం- గల్లా పెట్టెలో ఉంచిన వ్యాపారాభివృద్ధి.. ఇంట్లో పూజించిన వాస్తుదోషాలు తొలుగును.
త్రిదళం+ఉమ్మెత్తపువ్వు =చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయని ప్రతీతి.
6-21పత్రాలు కలిగిన బిల్వపత్రం పూజిస్తే పనుల్లో అఖండ విజయం సాధిస్తారు.
శ్వేతబిల్వం- ఆరోగ్యం ప్రదాయిని..
అయితే వీటన్నింటిలోకి త్రిమూర్తి స్వరూప బిల్వపత్రమే శివునికి అత్యంత ప్రీతిదాయకం.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









