Mangal Budh Parivartan Yog 2023: హిందూ మతం లేదా జ్యోతిషశాస్త్రంలో 'సూర్య గ్రహణం' శుభప్రదంగా పరిగణించబడదు. 2023లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడుతుంది. సూర్య గ్రహణం రోజున గ్రహాల స్థితి చాలా ఉత్కంఠగా ఉండబోతోంది. సూర్య గ్రహణం రోజున బుధుడు మేష రాశిలో ఉంటాడు. మరోవైపు కుజుడు మిధున రాశిలో ఉంటాడు. మేష రాశిలో బుధుడి సంచారం, మిథున రాశిలో కుజుడి సంచారం రాశిచక్ర మార్పును (కుజుడు మరియు బుధ గ్రహాలు కలిసి రాశి మార్పు యోగం (Mangal Budh Gochar 2023) సృష్టిస్తోంది. ఈ యోగం (Mangal Budh Parivartan Yog 2023) యొక్క శుభ మరియు అశుభ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. సూర్య గ్రహణం రోజు ఏయే రాశుల వారికి కుజుడు, బుధుడుల ద్వారా ఏర్పడిన యోగం శుభప్రదమో.. ఎవరికి అశుభమో ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి: 
కర్కాటక రాశి వారికి సూర్య గ్రహణం రోజున కుజుడు, బుధుడు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వ్యక్తులు వారి వారి కెరీర్‌లో అద్భుత ప్రయోజనం పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


కుంభ రాశి: 
రాశి మార్పు యోగం కుంభ రాశి వారికి కూడా మంచి లాభాలను ఇస్తుంది. ఊహించని రీతిలో ఆదాయం పెరుగుతుంది. దుబారా ఖర్చులను నియంత్రించండి. ఈ సమయంలో ఏ పని చేసినా శుభ ఫలితాలను ఇస్తుంది.


Also Read: Kia Carens 2023: కియా నుంచి సరికొత్త 7-సీటర్ కారు విడుదల.. ఫీచర్లు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!


మిథున రాశి: 
మిథున రాశి వారికి సూర్య గ్రహణం నాడు ఏర్పడుతున్న రాశి మార్పు యోగం చాలా మేలు చేస్తుంది. ఈ రాశి వారు గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం భారీగా పెరుగుతుంది. జీవితంలో పెను ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది.


సింహ రాశి: 
సూర్య గ్రహణం 2023 సింహ రాశి వారికి కుజుడు-బుధ గ్రహాల ప్రత్యేక స్థానం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ప్రమోషన్ఇం లేదా క్రిమెంట్ పొందవచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. డబ్బకు ఏ కొదవ ఉండదు. 


ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి:
మేషం, వృషభం, కన్యా, తులా మరియు మకర రాశులకు మేష రాశిలో బుధ సంచారము మరియు మిథున రాశిలో కుజుడు సంచరించడం అశుభంగా ఉంటుంది. ఈ వ్యక్తుల జీవితంలో కష్టాలు వస్తాయి. రోజురోజుకీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. పని తీరులో సమస్య ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదించకండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.


Also Read: Mahindra XUV400 Errors: మహీంద్రా ఎక్స్‌యూవీ400లో 3 లోపాలు.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి