Mauni Amavasya: ఆదివారం అమావాస్య.. ఈ చిన్న పరిహరం పాటిస్తే ఏడాదంతా భారీగా ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం.!.

Mauni Amavasya powerful remedies: చాలా మంది ఎంత కష్డపడ్డ ధనం నిలవట్లేదని తెగ బాధపడిపోతారు. అలాంటి వారు అమావాస్య రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే భారీగా ధనలాభం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 17, 2026, 10:36 PM IST
  • శక్తివంతమైన మౌనీ అమావాస్య..
  • పలు రెమిడీలు సూచించిన జ్యోతిష్యులు..
Mauni Amavasya: ఆదివారం అమావాస్య.. ఈ చిన్న పరిహరం పాటిస్తే ఏడాదంతా భారీగా ధనలాభంతో పాటు సొంతింటి కలసాకారం.!.

Mauni Amavasya on Sunday secrete remedies as per astrology: జ్యోతిష్య పండితుల ప్రకారం మౌనీ అమావాస్యను చాలా శక్తివంతమైనదిగా చెబుతుంటారు. మనం ఈసారి మౌనీ అమావాస్యను ఆదివారం రోజున అంటే రేపు 18వ తేదీరోజున జరుపుకుంటాం. చాలా మంది ఎంత కష్టపడ్డ డబ్బులు మంచి నీళ్లలో డబ్బులు ఖర్చైపోతున్నాయని బాధపడతారు. నెలతిరక్కుండానే డబ్బులు అన్ని ఖాళీ అవుతాయి. ఇలాంటి వారు మౌనీ అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం సంధ్యవేళ కొన్ని రెమిడీలు చేయాలి. బొగ్గులను తీసుకుని దాని మీద మంట పెట్టాలి.

Add Zee News as a Preferred Source

ఆ తర్వాత ఆర్పివేసి దాని మీద నల్లని నువ్వులు వేయాలి. దీని పొగను ఇంట్లో ఇవ్వాలి. దీని వల్ల నెగెటివ్ ఎనర్జీ బైటకు పోతుంది. అమావాస్య రోజున నల్లనువ్వులు, ఎండిన మిరపకాయలు గిన్నెలో తీసుకుని పారే నీళ్ల దగ్గరకు వెళ్లాలి. అక్కడ తమ చుట్టు తాము మూడుసార్లు క్లాక్ వైస్, ఆంటి క్లాక్ వైస్ తిప్పి పారే నీళ్లలో వేసేయాలి.

వెనక్కు తిరక్కుండా ఇంటికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వెళ్లాలి. అదే విధంగా పసుపు బట్టను తీసుకుని దానిలో పసుపుకొమ్ము వేసి దానిలో పసుపు, కుంకుమ,బియ్యం వేయాలి. దాన్ని మూటకట్టి అమావాస్య రోజున ధూపం ఇచ్చి లాకర్ లో పెట్టుకొవాలి. ఇలా చేసిన కూడా లాకర్ లోని డబ్బులు ఖర్చుకాకుండా ఉంటాయి. సొంతింటి కల కూడా సాకారం అవుతుంది.

Read more: Mauni Amavasya 2026: మౌనీ అమావాస్య రోజు మౌనవ్రతం ఉండాలా..?.. పండితులు ఏంచెబుతున్నారంటే..?

దీనితో పాటు పూర్వీకుల అనుగ్రహం కోసం దానధర్మాలు, నల్లని చీమలకు చక్కెర, శునకాలకు చపాతీలు,  అశ్వత్థచెట్టు దగ్గర దీపారాధన వంటివి చేయాలి. ఈ విధంగా రెమిడీలు పాటిస్తే ఇంట్లోని ధనంకు లోటుండదని కొంత మంది జ్యోతిష్యులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News