)
Mercury Favourite Zodiac Sign Telugu: సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమే బుధుడు.. అందుకే ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని గ్రహాల్లోకెల్లా ఈ గ్రహం చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం పరంగా వ్యాపారం, తెలివితేటలు, వాక్చాతుర్యం, స్పృహ, నైపుణ్యానికి సూచికగా భావిస్తారు.. కాబట్టి ఈ శుభప్రదమైన గ్రహం సంచారం చేయడం వల్ల అన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అద్భుతమైన మార్పులతో పాటు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉన్న రాశుల వారికి ఎప్పుడు అద్భుతమైన ధన లాభాలు కలుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా జీవితంలో దేనికి నోటు ఉండదు.. అయితే, ఈ గ్రహ శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి ఎల్లప్పుడూ అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా కన్యా రాశితో పాటు మిధున, ఇతర రాశుల వారికి బుధుడి అనుగ్రహం చేత విశేషమైన లాభాలు పలుకుతాయి.
బుధుడి అనుగ్రహం పొందే రాశులు..
మిధున రాశి
ముఖ్యంగా బుధుడి అనుగ్రహం మిధున రాశి వారు ఎల్లప్పుడూ పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆకర్షణ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ రాశి వారికి ఎల్లప్పుడూ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఎలాంటి వ్యాపారాలు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా వివాహితులు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బుధుడి అనుగ్రహం వల్ల మిధున రాశి వారికి విద్యారంగంలో కూడా మంచి లాభాలు కలుగుతాయి. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంపాదన పొందే అవకాశాలుంటాయి. ముఖ్యంగా డబ్బు పరంగా వీరికి ఎల్లప్పుడూ విశేషమైన లాభాలు కలుగుతూనే ఉంటాయి. వీరు ఎల్లప్పుడూ గణేశుడు తో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు జీవితంలో కూడా ఎంతో సులభంగా ముందుకెళ్లగలుగుతారు.
కన్యా రాశి
కన్య రాశి వారికి కూడా బుధుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. దీనివల్ల వీరు ఎల్లప్పుడు అత్యధిక లాభాలు పొందుతూనే ఉంటారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేయడమే కాకుండా వీరు వ్యాపారాలు చేసి విశేషమైన ప్రయోజనాలు ఉండగలుగుతారు. డబ్బు పరంగా వీరికి అదృష్టం చాలా వరకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే ఆరోగ్యం కూడా వీరికి ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది. అందుకే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు. కన్యారాశి వారు ఉద్యోగాల్లో కూడా చాలా బాగా రాణించగలుగుతారని. వీరికి కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉండడం వల్ల వాటితో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు.. కన్యా రాశి వారికి ఎల్లప్పుడు ఎలాంటి కష్టాల్లో నుంచైనా పరిష్కారం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి