Mercury Retrograde November 2025 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని గ్రహాలన్నింటికీ రాకుమారిడిగా పిలుస్తారు. ఈ గ్రహ ప్రభావం ప్రతి నెల అన్ని రాశుల వారిపై కొనసాగుతుంది. ముఖ్యంగా నవంబర్ నెలలో ఈ గ్రహం ప్రభావం కొన్ని రాశుల వారిపై రెట్టింపుగా కొనసాగుతుంది. ఎందుకంటే నవంబర్ 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వృశ్చిక రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మానసికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అరుదైన అవకాశాలు కూడా లభిస్తాయని.. అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే సత్సంబంధాలు కూడా మెరుగుపడతాయి. బుధుడి తిరోగమన ప్రభావంతో ఏయే రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో? ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోయే రాశులేవో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బుధుడి తిరోగమన ప్రభావం వల్ల లాభాలు పొందబోయే రాశులు...
మిధున రాశి
బుధుడు పాలించే గ్రహాల్లో మిధున రాశి ఒకటి. ఈ రాశి వారికి గ్రహతి రోగమనం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా గతంలో ఇబ్బంది పడ్డ పనుల్లో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా జర్నలిజం రంగంలో ఉన్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలగబోతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో వర్క్ చేసే వ్యక్తులకు కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అసంపూర్ణంగా ఉన్న పనులని ఈ సమయంలో సంపూర్ణంగా పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా కోటీశ్వరులు అవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడికి తిరోగమ ప్రభావం అద్భుతమైన లాభాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి గతంలో జరిగిన పనుల నుంచి ఇప్పుడు ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ప్రాజెక్టుల వారిగా పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. దీంతోపాటు సీనియర్ల నుంచి అపార్ధాలు కూడా తొలగిపోతాయి. ఎప్పటినుంచో మంచి పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీంతోపాటు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే వారికి పనులు ఊపందులు ఉంటాయి. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా పనులు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు.
Also Read: Siddha Yoga: ఈ రోజే సిద్ద యోగం.. ఈ రాశుల వారికి పెరిగిన అదృష్టం.. ఊహించని డబ్బే, డబ్బు..
వృషభరాశి
బుద్ధుడి తిరోగమనం వృషభ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో పనులు చేస్తున్న వ్యక్తులకి అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. దీనికి కారణంగా త్వరలోనే వీరు ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. అలాగే గతంలో చిక్కుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. దీంతోపాటు నిలిచిపోయిన చర్చలు కూడా జరిగే అవకాశాలున్నాయి. అహంకారంతో కాకుండా సంతోషంగా మాట్లాడడం వల్ల ఈ సమయం ఎన్నో రకాల విజయ అవకాశాలను అందిస్తుంది. అలాగే కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఇవి గోల్డెన్ డేస్‌గా భావించవచ్చు.
నోట్: ఇక్కడ అందించిన సమాచారం మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించదు.
Also Read: Siddha Yoga: ఈ రోజే సిద్ద యోగం.. ఈ రాశుల వారికి పెరిగిన అదృష్టం.. ఊహించని డబ్బే, డబ్బు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









