Mercury Transit 2026 On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని బుద్ధి వాక్కు వాదనలకు ప్రతీకగా భావిస్తారు. ఇలాంటి ప్రత్యేకత కలిగిన గ్రహం జనవరి 17న 10 గంటల సమయంలో మకర రాశిలోకి ప్రవేశించింది. ఈ గ్రహం వచ్చేనెల మూడవ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతుంది. ఆ తర్వాత శని పాలించే కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి గణనీయంగా తెలివితేటలు పెరగడమే కాకుండా వ్యాపార రంగాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు అద్భుతమైన ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. క్రమశిక్షణ పెరిగి ఉద్యోగాలు చేసే వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో ఆగిపోయిన వారి ఈ సమయంలో అద్భుతమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన సానుకూలమైన ప్రభావం ప్రారంభమవుతుంది. అనుకోకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. బుధుడి ప్రభావంతో శనివారం నుంచి ఏ రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ఊహించని జాక్‌పాట్:
వృషభరాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడి సంచారంతో జీవితంలో అద్భుతమైన సానుకూలమైన మార్పులు ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా వీరి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం అద్భుతంగా ప్రయాణాలు చేయగలుగుతారు. మతపరమైన పనుల్లో పాల్గొని సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. జీవితంలో సానుకూలమైన మార్పులు ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి.
మిథున రాశి
మిధున రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడి ప్రభావంతో జీవితంలో సానుకూలమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా లోతైన విషయాల పట్ల అధ్యయనాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో ఆసక్తి పెరిగి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే డబ్బు సంపాదించడానికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో ఉన్నత అధికారులతో ఉద్యోగాలకు మంచి సంబంధాలు ఏర్పడి.. కాస్త ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా కొంత తగ్గే ఛాన్స్ ఉంది.
కన్యారాశి
బుధుడు చేసిన సంచారంతో కన్యా రాశి వారికి జీవితంలో సానుకూలమైన ప్రయోజనాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో పోటీ పెరిగి పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించడమే కాకుండా పనుల్లో ఓపిక పెరుగుతుంది. అలాగే వ్యూహాలతో ఈ సమయం నుంచి ముందుకెళ్తారు. ఎప్పటినుంచో కష్టపడి పని చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
మకర రాశి
బుధుడి సంచారం మకర రాశి వారిపై కూడా సానుకూలమైన ప్రభావాన్ని చూపుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి కూడా ఈ సమయం నుంచి జీవితంలో అనేకమార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులు కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక సమతుల్యత కూడా పెరుగుతుంది. సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా కాస్త తొలగిపోయే అవకాశాలున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









