)
Mars Transit Effect On Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడిని అగ్ని గ్రహానికి సూచికగా భావిస్తారు. అంతేకాకుండా దీనిని మేష, వృశ్చిక రాశులకి అధిపతిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే దీనిని ధైర్యం, వీరత్వంతో పాటు ఆత్మవిశ్వాసానికి సూచికగా కూడా భావిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గ్రహం సంచారం, తిరోగమనం చేసినప్పుడు మొత్తం 12 రాశులవారిపై చాలా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే కుజ గ్రహం నవంబర్ 19వ తేది సాయంత్రం 7 గంటలకు జ్యేష్ట నక్షత్రంలోకి సంచారం చేసింది.
ఈ సంచారం చాలా ప్రత్యేకమైనగా భావిస్తారు. చాలా రోజుల తర్వాత కుజుడు నక్షత్ర సంచారం చేయడంతో ఈ కింది రాశులవారికి చాలా కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఆకస్మికంగా మానసికంగా మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, కుజుడి ప్రత్యేకమైన నక్షత్ర సంచారం ప్రభావంతో మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కూడా తప్పవు.. ఈ సమయంలో అత్యధికంగా లాభాలు పొందే రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి సమస్యలు తప్పవు:
కన్య రాశి
కుజుడి సంచారం ప్రభావంతో ఈ రోజు నుంచి కన్య రాశులవారికి ఊహించని స్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వైవాహిక జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీంతో పాటు ఈ సమయంలో ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల పెట్టకపోవడం చాలా మంచిది.
మేష రాశి
కుజుడి సంచారంలో మేష రాశివారికి ప్రతికూల పరిస్థితులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశివారు వాహనాలు నడిపే క్రమంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పనిలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి
కుజుడి సంచారంతో కర్కాటక రాశివారికి మిశ్రమ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు మనసిక ప్రశాంతత కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఒత్తిడి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. భాగస్వామ్య జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చిపడతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా అనేక సమస్యలు వస్తాయి. ఆర్థికంగా కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ధనుస్సు రాశి
కుజుడి ఎఫెక్ట్‌తో ధనుస్సు రాశివారికి ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఉన్నతాధికారులతో సంభాషనల్లో కీలక మార్పులు వస్తాయి. దీంతో పాటు కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించకపోవచ్చు. దీంతో పాటు ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. కుటుంబ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. అంతేకాకుండా ఆగ్రహంతో అనేక పనులు చేసి.. తీవ్ర ఇబ్బందుల పాలవుతారు.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం నిపుణులు నుంచి సేకరించింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook