)
Nava Panchami Raja Yoga Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల సంచారం వ్యక్తిగత జీవితాల్లో వివిధ మార్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కొన్ని నెలల్లో గ్రహాలు తరచుగా రాశి సంచారం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాబోయే అక్టోబర్ నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన రెండు గ్రహాల సంయోగం కూడా జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు గ్రహాల సంయోగం జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో శక్తివంతమైన రాజయోగాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల సంపాదనతో పాటు విపరీతంగా ధన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా అక్టోబర్ 20వ తేదీన బుధుడు, శని కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి దీపావళి నుంచి శుభ ఘడియలు రావడం ప్రారంభమౌతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే అమ్మవారి అనుగ్రహం లభించి ఊహించని లాభాలు పొందుతారు. అయితే దీపావళి సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశులవారికి లాభాలు:
వృషభరాశి
వృషభ రాశి వారికి శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడడం వల్ల కోరుకున్న కోరికల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు ఈ సమయంలో కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా వ్యాపారాలపరంగా గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఈ సమయంలో సామాజిక స్థితి కూడా పెరిగి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అద్భుతమైన శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా దీపావళి రోజు నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొన్ని రకాల ఆర్థిక వనరులు కూడా పొంది..విశేషమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ సమయంలో కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. ఈ సమయంలో పిల్లలనుంచి కూడా అనేక శుభవార్తలు వింటారు. దీపావళి సమయంలో ఈ రాశి వారు ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. అలాగే గతంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
మకర రాశి
మకర రాశి వారికి శనిబుదుల కలయిక కారణంగా ఏర్పడే అరుదైన రాజయోగం వల్ల పురోగతి విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీరు ఈ సమయంలో కొత్త బాధ్యతలను కూడా చేపడతారు. అదృష్టం విపరీతంగా పెరిగి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. వివాహ జీవితంలో విభేదాలతో పాటు అపార్ధాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాపారాల్లో నష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి