)
Trigrahi Yoga Effect On Zodiac Telugu: ఆగస్టు 22వ తేదీ నుంచి బుధ శుక్ర చంద్ర గ్రహాల కలయిక జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది.. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.. అలాగే ఆర్థిక సమస్యలతో పాటు గృహ సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. ఈ రాజయోగం బాద్ర మాస అమావాస్య రోజున ఏర్పడింది. కాబట్టి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.. అలాగే లక్ష్మీనారాయణ యోగంతో పాటు గౌరీ యోగం వంటి ఇతర శుభయోగాలు కూడా ఇదే సమయంలో ఏర్పడడం విశేషం.
ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు కష్టపడి పనులు చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారుతాయి. ఈ సమయంలో ఆహ్లాదకరమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో ఉన్నవారు పనుల్లో అద్భుతమైన ప్రశంసలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో వ్యాపారాల్లో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో ఆనందాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఎన్నో సమస్యలు ఈ సమయాల్లో పరిష్కారం కాబోతున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం వల్ల చాలావరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా వీరికి ఆర్థికపరమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి.. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భారీ మొత్తంలో లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి సమాజంలో గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఎంతో కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. భవిష్యత్తులో వీరు సువర్ణ అవకాశాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది దీని కారణంగా వీరు జీవితంలో సానుకూలమైన మార్పులు చూస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ నెలలో భారీ మొత్తంలో లాభాలుగా మారుతాయి.. ముఖ్యంగా ఆర్థికపరంగా పురోగతి సాధించే అవకాశాలున్నాయి. క్రమక్రమంగా వీరు ఎలాంటి పనులు చేసినా విజయం దిశగా అడుగులు వేస్తారు. అలాగే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతోషకరమైన ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో పనికి తగ్గ ప్రశంసలు లభిస్తాయి. కాబట్టి కష్టపడి పనిలో చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభరాశి వారికి ఈ సమయంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది.. ముఖ్యంగా వీరు వివిధ అంశాల నుంచి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. వీరికి పనుల్లో పురోగతి లభించడమే కాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతోంది. ఎప్పటినుంచో అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. దీంతోపాటు వీరికి మానసిక ఒత్తిడి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత పరిష్కారం కూడా లభిస్తుంది.
మిథున రాశి
ఈ పవర్ ఫుల్ త్రిగ్రహి రాజయోగం వల్ల మిధున రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరు ఓర్పుతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఏవైనా నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో మీరు సానుకూలమైన లాభాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి