)
Navaratri Utsav: దసరా అంటే హిందూవులకు అతి పెద్ద పండుగ. దసరాకు ముందు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటారు. దుర్గాష్టమి వరకు అమ్మవారు రోజుకో రూపంలో కనిపిస్తారు. ఆయా రూపాల్లో దర్శనమిచ్చిన సమయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దసరా అంటే పది రోజుల పండుగ. నవరాత్రి ఉత్సవాల్లో ఏ రోజు అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారో తెలుసుకుందాం.
విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై వెలసిని కనకదుర్గా దేవీ ఆలయంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు. దసరా శరన్నవరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అవతార విశేషాలు ఇలా ఉన్నాయి.
9 రోజులు తొమ్మిది రూపాలు
22వ తేదీ సోమవారం: ఆశ్వీయుజ శుధ్ధ పాడ్యమి రోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు.
23వ తేదీ మంగళవారం: ఆశ్వీయుజ శుద్ధ విదియ రోజు అమ్మవారు గాయత్రీ దేవి రూపం
24వ తేదీ బుధవారం: ఆశ్వీయుజ శుద్ధ తదియ రోజు అన్నపూర్ణాదేవి దర్శనం
25వ తేదీ గురువారం ఆశ్వీయుజ శుద్ధ చవితి: కాత్యాయనీ దేవి రూపంలో అమ్మవారు కనిపిస్తారు.
26వ తేదీ శుక్రవారం: ఆశ్వీయుజ శుద్ధ చవితి రోజు మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమిస్తారు
27వ తేదీ శనివారం: ఆశ్వీయుజ శుద్ధ పంచమి రోజు లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనం
28వ తేదీ ఆదివారం: ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు మహాచండీ దేవిగా అమ్మవారు కనిపిస్తారు
29వ తేదీ సోమవారం: ఆశ్వీయుజ శుద్ధ సప్తమి రోజు చదువుల తల్లీ సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు
30వ తేదీ మంగళవారం: ఆశ్వీయుజ శుద్ధ అష్టమి. నవరాత్రి ఉత్సవాల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. ఈ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారు కనిపిస్తారు
అక్టోబర్ 1వ తేదీ బుధవారం: ఆశ్వీయుజ శుద్ధ నవమిని మహర్నవమి అంటారు. ఈరోజు మహిషాసురమర్దినీ దేవిగా దర్శనం
2వ తేదీ గురువారం: ఆశ్వీయుజ శుద్ధ దశమి నవరాత్రి ఉత్సవాల్లో అతి ప్రధానమైనది. విజయదశమి అంటే దసరా పండుగ. ఈ రోజు రాజరాజేశ్వరీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook