Personality Traits By Birth Date: 1 నుంచి 9 తేదీలో పుట్టిన వారికి ఉండే అద్భుతమైన లక్షణాలు ఇవే..!

Numerology And Your Birth Date Traits: సంఖ్యాశాస్త్రంలో మీ పూర్తి పుట్టిన తేదీలోని అంకెలన్నింటినీ కలిపి వచ్చే ఒకే అంకెను "జీవిత పథం సంఖ్య" అంటారు. ఈ అంకెలు మీ వ్యక్తిత్వం,  జీవితంలోని సవాళ్లను, గుణాల గురించి చెబుతాయి. అయితే 1 నుంచి 9 తేదీలో పుట్టినవారి గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 20, 2025, 11:35 AM IST
Personality Traits By Birth Date: 1 నుంచి 9 తేదీలో పుట్టిన వారికి ఉండే అద్భుతమైన లక్షణాలు ఇవే..!

Numerology and Your Birth Date traits: సంఖ్యాశాస్త్రం అనేది ఒక పురాతనమైన విశ్వాసం. ఇది వ్యక్తి పుట్టిన తేదీ, ఇతర సంఖ్యలు  ఎలా  ఒకరి వ్యక్తిత్వం, జీవిత మార్గం, భవిష్యత్తు గురించి ముఖ్యమైన విషయాలను చెబుతుందని సంఖ్యానిపుణులు చెబుతున్నారు. సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన శక్తి, అర్థం ఉంటుంది. ఈ సంఖ్యలను విశ్లేషించడం ద్వారా  ఒక వ్యక్తి బలహీనతలు, బలాలు, కోరికలు, సవాళ్లను అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సంఖ్యాశాస్త్రం మూలాలు ఏంటి? 1 నుంచి 9 లో పుట్టిన వారి లక్షణాలు, గుణాలు గురించి మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

సంఖ్యాశాస్త్రం మూలాలు చాలా పురాతనమైనదని నిపుణులు చెబుతున్నారు. కానీ కొందరూ మాత్రం ఇది ప్రాచీన ఈజిప్ట్, బాబిలోనియా నాగరికతలలో అధికంగా కనిపిస్తాయని చెబుతున్నారు. గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు పైథాగరస్ (క్రీ.పూ. 570-495) సంఖ్యాశాస్త్రానికి పునాది వేశాడని చర్రిత చెబుతుంది. అతను సంఖ్యలు విశ్వం, ప్రాథమిక సూత్రాలని, ప్రతిదీ సంఖ్యాపరమే నడుస్తుందని నమ్మాడు. అతని సిద్ధాంతాలు తరువాత సంఖ్యాశాస్త్రం అభివృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అయితే సంఖ్యాశాస్త్రంలో, మీ పుట్టిన తేదీ చాలా ముఖ్యమైనది. మీ పూర్తి పుట్టిన తేదీలోని అంకెలన్నింటినీ కలిపి ఒకే అంకె వచ్చే వరకు కూడతారు. ఈ చివరి అంకెను మీ "జీవిత పథం సంఖ్య" అంటారు. ప్రతి జీవిత పథం సంఖ్య మీ వ్యక్తిత్వం కొన్ని ముఖ్యమైన లక్షణాలను, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అవకాశం ఉన్న కొన్ని సవాళ్లను సూచిస్తుంది. ఇప్పుడు మనం 1 నుంచి 9 తేదీలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం. 

1వ తేదీలో పుట్టినవారు: మనలో చాలా మంది ఏదో ఒక నెలలో ఒకటి తేదీన పుట్టి ఉంటారు. ఈ తేదీలో పుట్టినవారు సహజ నాయకులుగా సంఖ్యానిపుణులు చెబుతున్నారు. ఈ తేదీలో పుట్టినవారు ఎంతో శక్తి వంతులు, స్వాతంత్ర్యంగా ఉండటాని ఇష్టపడుతారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు వారు మొండిగా, స్వార్థపూరితంగా ఉండవచ్చు.

2వ తేదీలో పుట్టినవారు: రెండవ తేదీలో పుట్టినవారు ఎంతో సున్నితమైనవారిగా ఉంటారు. వీరు ఎల్లప్పుడు శాంతిని, సామరస్యాన్ని విలువైనదిగా భావిస్తారు. ఈ తేదీలో పుట్టిన వారు ఎక్కువగా ఇతరులపై  ఆధారపడుతారని నిపుణులు చెబుతున్నారు. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయవచ్చు.

3వ తేదీలో పుట్టినవారు: ఈ తేదీతో పుట్టిన వారు ఎంతో  సృజనాత్మకత కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా మాట్లాడటానికి, రాయడానికి,  కళల ద్వారా తమను తాము వ్యక్తీకరించడానికి ఇష్టపడతారు. మూడవ తేదీలో పుట్టిన వారు ఉత్సాహంగా ఉంటారు. కొన్నిసార్లు క్రమశిక్షణ లేకుండా ఉండవచ్చు.

4వ తేదీలో పుట్టినవారు: నాలుగు తేదీలో పుట్టిన వారు కష్టపడేవారిగా చెబుతారు నిపుపుణులు. వీరికి స్థిరత్వం అంటే  ఎంతో ఇష్టం. ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారు.కొన్నిసార్లు మొండిగా ఉంటారు. కానీ ఎంతో మంచి మనస్సు ఉంటుంది. 

5వ తేదీలో పుట్టినవారు: వీరు స్వేచ్ఛను ప్రేమించే వారు. సాహసోపేతమైన వ్యక్తులని సంఖ్యనిపుణులు చెబుతున్నారు. కొత్త అనుభవాలు అంటే చాలా ఇష్టం ఈ తేదీలో పుట్టినవారికి. త్వరగా ఆలోచించగలరు. కొన్నిసార్లు వారు బాధ్యతారహితంగా ఉండవచ్చు.

6వ తేదీలో పుట్టినవారు: ఈ తేదీలో పుట్టినవారు బాధ్యతాయుతమైన వ్యక్తులు. వీరు ఎక్కువగా కుటుంబం, సమాజానికి ప్రాముఖ్యత ఇస్తారు.  ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు ముందు ఉంటారు. కొన్నిసార్లు వారు జోక్యంచేసుకునే విషయంలో ఆధిపత్యం చెలాయించే స్వభావం కలిగి ఉండవచ్చు.

7వ తేదీలో పుట్టినవారు: ఎడు సంఖ్యకు సంఖ్యశాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది.  ఈ తేదీలో పుట్టినవారు అంతర్ దృష్టి కలిగిన వ్యక్తులు. జ్ఞానం, అవగాహన కోసం ఆరాటపడతారు.  తరచుగా ఒంటరిగా ఉండటానికి, లోతుగా ఆలోచించడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు వారు రిజర్వుగా ఉండటం వల్ల ఇతరులు వీరిని అర్థం చేసుకోలేకపోతారు.

8వ తేదీలో పుట్టినవారు: ఈ తేదీలో పుట్టిన వారు  విజయ-ఆధారిత వ్యక్తులుగా చెబుతారు నిపుణులు. వారికి వ్యాపారం, ఆర్థిక విషయాలలో మంచి నైపుణ్యం ఉంటుంది.  కొన్నిసార్లు వారు మెటీరియలిస్టిక్‌ స్వభావం కలిగి ఉంటారు.

9వ తేదీలో పుట్టినవారు: తొమ్మిదవ తేదీలో జన్మించిన వారు దయగల వ్యక్తులు. ఇతరుల పట్ల లోతైన సానుభూతి ఉంటుంది. ప్రపంచాన్ని మెరుగుపరచడానికి వారు తరచుగా ప్రయత్నిస్తారు.  కొన్నిసార్లు వారు భావోద్వేగంగా, ఆదర్శవాదంగా ఉండవచ్చు.

సంఖ్యాశాస్త్రం అనేది కేవలం ఒక శాస్త్రాం. ఇది కేవలం సమాచారాన్ని ఇస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం.  వ్యక్తిత్వం, జీవితం అనేవి ఒక సాధారణ ధోరణులను సూచించే ఒక సాధనం మాత్రమే. మీ స్వంత ఎంపికలు, చర్యలు మీ భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలుసుకోండి. సరైన అవగాహన, విశ్లేషణతో, సంఖ్యాశాస్త్రం మీ వ్యక్తిగత వృద్ధికి, స్వీయ-అవగాహనకు ఒక విలువైన సాధనంగా ఉపయోగపడుతుంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News