Maha Bhakti channel: మహా భక్తి ఛానల్ లోగో ఆవిష్కరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘మహా భక్తి’ ఛానల్ లోగో ఆవిష్కరించబడింది. హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభమైన ఈ ఛానల్, భక్తి కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..   

Written by - Vishnupriya | Last Updated : Feb 26, 2025, 12:40 PM IST
Maha Bhakti channel: మహా భక్తి ఛానల్ లోగో  ఆవిష్కరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!

Maha Bhakti channel: తెలుగు రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మాన్ని మరింత ప్రోత్సహించేందుకు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచేందుకు ‘మహా భక్తి’ ఛానల్ ఆవిష్కరించబడింది. మహా టివి న్యూస్ అధ్వర్యంలో రాబోతున్న ఈ ఛానల్ లాంచ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సి.ఎమ్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని లోగో ఆవిష్కరించారు.  

Add Zee News as a Preferred Source

ఈ సందర్భంగా మహా న్యూస్ ఎమ్.డి వంశీ కృష్ణ మాట్లాడుతూ, ‘‘ఈ ఛానల్ హిందూ సంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా నడుస్తుంది. హిందూ భక్తికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక చర్చలతో ప్రజలలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు మా మహా భక్తి ఛానల్ కృషి చేస్తుంది’’ అని తెలిపారు.  

లోగో ఆవిష్కరణలో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ‘‘సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా కొన్ని ప్రసార మాధ్యమాలు వ్యవహరిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని రక్షించే ఒక గొంతు అవసరమని భావించి మహా భక్తి ఛానల్ ప్రారంభించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మన చరిత్ర, సంప్రదాయాలను కొత్త తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే’’ అని పేర్కొన్నారు.  

ఈ ఛానల్ ద్వారా భక్తి సంబంధిత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, ప్రత్యేక పూజలు ప్రసారం కానున్నాయి. తెలుగు ప్రజలంతా ఈ ఛానల్‌ను ఆదరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మరో పక్క పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా.. సినిమాలు పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . త్వరలోనే ఈ హీరో హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుచిత్ర దర్శకత్వంలో రానున్న ఓజీ చిత్రంలో కూడా కనిపించనున్నారు.

Also Read: Zoo Park Price Hike: పర్యాటకులకు షాక్.. భారీగా పెరగనున్న జూపార్క్ ధరలు

Also Read: Neera Cafe: హైదరాబాద్‌ ప్రజలకు భారీ షాక్‌.. నీరా దుకాణం బంద్‌?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News