)
Shani Dev Powerful Effect On Zodiac Telugu: తొమ్మిది గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహమే శనిగ్రహం.. ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా దీనిని కీడు గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం జీవితంలో అత్యంత కీడుగా భావిస్తారు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారైతే తీవ్రంగా నష్టపోయిన వారు కూడా ఉన్నారు. అయితే, ఏలినాటి శని వ్యక్తులు చేసే కర్మలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. నిజజీవితంలో మీరు ఇతరులకు సహాయం చేయడం వల్ల ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా చేసే పనులను బట్టి ఈ సమయంలో శని ఫలితాలనందిస్తాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చి 29వ తేదీన శని దేవుడు మీనరాశిలోకి సంచారం చేశాడు. అలాగే జూలై 13వ తేదీన ఈ గ్రహం తీరో గమనం చేసింది. ఇప్పుడు తిరోగమన దశలోనే ఉన్నాడు.
అయితే, నవంబర్ 28వ తేదీన కూడా శని ప్రత్యేకమైన మార్పులు చేయబోతున్నాడు. శని కదలికలు అక్టోబర్ 20 దీపావళి నుంచి ప్రారంభమవుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో శని కదలికకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ గ్రహం కదలిక జరపడం కారణంగా కొన్ని రాష్ట్రాల వారి జీవితాల్లో ఊహించని మార్పులు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మేలు జరిగితే.. మరికొన్ని రాశుల వారికి చాలా కీడు జరుగుతుంది. అయితే దీపావళి తర్వాత శనిలో వచ్చే మార్పుల కారణంగా ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు దీపావళి నుంచి తెరుచుకుంటాయి. ముఖ్యంగా వీరికి పదోన్నతులు లభించడమే కాకుండా జీతం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ సమయంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కెరీర్ పరంగా ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఉద్యోగాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీపావళి సమయంలో వచ్చే శని మార్పుల కారణంగా వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా ముందస్తు పెట్టుబడుల నుంచి కూడా భారీ మొత్తంలో లాభాలు వస్తాయి. అలాగే జీవితంలో సానుకూలమైన మార్పులు కూడా వచ్చి.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువగా సంపాదన కూడా పొందతారు. అదృష్టం సహకరించి కొత్త కార్లు కొనుగోలు చేయడమే కాకుండా భవనాలు కూడా కొంటారు..
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయంలో అకస్మాత్తుగా సంపాదన వస్తుంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతోపాటు చిన్న చిన్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook